Virosh Wedding Expenditure : వారం రోజులు వెడ్డింగ్ సెలబ్రేషన్స్ - విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా?
Vijay Deverakonda Rashmika : స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి ఖర్చు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వారం రోజుల వేడుకల కోసం భారీగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

Vijay Deverakonda Rashmika Wedding Celebrations Expenditure : లగ్జరీ రిసార్ట్‌లో పెళ్లి... ఖరీదైన నగలు. అతిథులకు ప్రత్యేక విందు. దేశవ్యాప్తంగా స్వీట్స్ పంపిణీ, ఆలయాల్లో అన్నదానం. సొంతూరిలో సత్య నారాయణ వ్రతం. గ్రామస్థులందరికీ భోజనాలు. ఆ తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్. ఇదీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మికల వారం రోజుల పెళ్లి సంబరం. మరి ఈ ఘన వేడుకకు ఎంత ఖర్చయ్యిందో అని తెలుసుకునేందుకు అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా?
విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి ఖర్చు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలోనే పెళ్లి జరిగినప్పటికీ ఖర్చు భారీగానే అయినట్లు తెలుస్తోంది. షాపింగ్, నగలు దగ్గర నుంచీ భోజనాలు, అతిథులకు వసతి, ఆతిథ్యం తదితర ఖర్చుల గురించి తెలిస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. విరోష్ కపుల్ పెళ్లి కోసం దాదాపు రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకూ ఖర్చు చేసినట్లు సమాచారం.
దేశంలోనే ఓ ప్రముఖ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే అతిథులకు వడ్డించే విందు దగ్గర నుంచీ ఏ కార్యక్రమం ఎప్పుడు ఎలా జరగాలో వారికి ముందే విజయ్ ప్లాన్ ఇచ్చినట్లు సమాచారం. పెళ్లి తంతులో ఈ జంట మొత్తం 3 కిలోల బంగారు నగలు ధరించారట. అందులో రష్మిక 2 కేజీలు, విజయ్ కేజీ బంగారు ఆభరణాల్లో మెరిసిపోయారు. వీరి బంగారు ఆభరణాలే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. వీరి పెళ్లి వేడుక స్ట్రీమింగ్ కోసం ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' భారీగా ఆఫర్ చేసినా అందుకు ఈ కపుల్ అంగీకరించనట్లు తెలుస్తోంది.
Also Read : పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ పోన్ - శ్రీరామ నవమికి 'బ్యాండ్ మేళం'... న్యూ రిలీజ్ డేట్ ఇదే
రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ, రష్మిక వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఉదయం హిందూ సంప్రదాయం ప్రకారం, సాయంత్రం కడువ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి రెండుసార్లు జరిగింది. కొత్త జంట ధరించిన నగలే సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచాయి. సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్‌గా మారాయి. ఇక విందు విషయానికొస్తే... తెలుగింటి సంప్రదాయ రుచులతో పాటు కడువ సంప్రదాయ రుచులను సైతం అతిథులకు వడ్డించారు. ప్రపంచ స్థాయి రుచులను మెనూలో చేర్చారు. స్వీట్స్ వెరీ స్పెషల్.
ఇక పెళ్లి తర్వాత దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈ జంట ఫ్యాన్స్‌కు స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. అంతే కాకుండా ప్రముఖ ఆలయాల్లో అందరికీ అన్నదానం చేశారు. కొందరు ఫ్యాన్స్ కూడా తమ ఊరిలో వీరి పెళ్లి సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సొంతూరికి వెళ్లిన విరోష్ కపుల్ అక్కడ కొత్త ఫామ్ హౌస్‌లో గృహ ప్రవేశంతో పాటు సత్య నారాయణ స్వామి వ్రతం చేశారు. అక్కడ గ్రామస్థులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 4న (బుధవారం) హైదరాబాద్ తాజ్ హోటల్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో పాటు నాగార్జున ఫ్యామిలీ, టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్స్ హాజరయ్యారు. అలా వారం రోజుల పాటు విరోష్ కపుల్ పెళ్లి వేడుకే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
ట్రెండింగ్ వార్తలు






















