Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై కేసు పెట్టనున్న బీజేపీ?
BJP MPs: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేసు నమోదుకు బీజేపీ సిద్ధమవుతోంది. పార్లమెంట్ ఆవరణలో బీజేపీ ఎంపీలపై ఆయన దాడి చేశారని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
BJP May File Case Against Rahul Gandhi: పార్లమెంటులో గురువారం తోపులాట వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై (Rahul Gandhi) కేసు నమోదు చేసేందుకు బీజేపీ ఎంపీలు సిద్ధమైననట్లు తెలుస్తోంది. సహచర ఎంపీలపై దాడి చేసేందుకు రాహుల్‌కు ఏ చట్టం అధికారం ఇచ్చిందని ప్రశ్నించారు. 'ఇతర ఎంపీలను కొట్టడానికే కరాటే, కుంగ్ ఫూ నేర్చుకున్నారా.?' అంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సెటైర్లు వేశారు. కాగా, అంబేడ్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గురువారం ఇండియా కూటమి పార్లమెంట్ ఆవరణలో ఆందోళన నిర్వహించింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య హింసాత్మక సంఘటనలు జరిగాయి. బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముకేశ్ రాజ్‌పుత్ గాయపడ్డారు. వీరిని ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ప్రధాని మోదీ వీరిని ఫోన్‌లో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
Also Read: Amit Shah: అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా