అన్వేషించండి

Amit Shah: అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 

Amit Shah On Ambedkar: అంబేడ్కర్‌పై అమిత్‌షా వ్యాఖ్యల దుమారం రేగింది. అయితే తన వ్యాఖ్యలను AI ఉపయోగించి మార్చి ప్రచారం చేశారంటున్నారు హోంమంత్రి

Amit Shah On Ambedkar : పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మంగళవారం నాడు రాజ్యసభలో హోంమంత్రి అమిత్‌షా చేసిన కామెంట్స్ చిచ్చురేపాయి. అంబేద్కర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌సహా అన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. ఇది రాజ్యాంగ నిర్మాతకు జరిగిన అవమానంగా ప్రచారం చేస్తున్నాయి. అయితే ఇదంతా కుట్రపూరితంగా జరుగుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. అమిత్‌షా వ్యాఖ్యలను వక్రీకరించి రాజకీయం చేస్తున్నాయని మండిపడుతోంది. 

అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్ అని చెప్పుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. ఇన్ని సార్లు దేవుడి పేరు స్మరించి ఉంటే ఏడు జన్మలకు స్వర్గంలో స్థానం దక్కేది... అని అమిత్‌షా మంగళవారం రాజ్యసభలో అన్నారు. ఈ కామెంట్సే తీవ్ర దుమారానికి కారణమవుతున్నాయి. బుధవారం నుంచి ఇదే అంశంపై అటు సభలో ఇటు బయట కూడా అమిత్‌షాను, బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సభలో కాంగ్రెస్‌ వర్శెస్‌ బీజేపీ అన్నట్టు మాటల యుద్ధం నడిచింది. రాజ్యసభలో అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభలో చర్చించాలని కాంగ్రెస్ పట్టుపట్టింది. దీనికి స్పీకర్ అంగీకరించలేదు. దీంతో కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. పెద్దల సభలో కూడా ఇదే దుమారంతో గందరగోళం ఏర్పడింది. గతంలో కాంగ్రెస్ నాయకులు చేసిన కామెంట్స్‌ను ప్రస్తావిస్తూ బీజేపీ ఎదురదాడి చేసింది. దీంతో రెండు సభలు ఒకరి వాయిదా పడ్డాయి అయిన పరిస్థితిలో మార్పు లేకపోవడంతో గురువారానికి వాయిదా పడ్డాయి.  

కాంగ్రెస్‌ను టార్గెట్‌గా అమిత్‌షా చేసిన కామెంట్స్‌నే ఇప్పుడు అస్త్రాలుగా చేసుకుంది. అంబేడ్కర్ ను అవమానించారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్ర కేబినెట్ నుంచి అమిత్‌షాను తొలగించాలని డిమాండ్ చేసింది. ఆయన దేశానికి క్షమాపణ చెప్పాలని అంటోంది. రాజ్యాంగంపై నమ్మకం లేని వాళ్లు మను స్మృతి గురించి మాట్లాడతారని మండిపడింది. ఈ కామెంట్స్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి.   

అమిత్ షాపై తృణమూల్ కాంగ్రెస్ కూడా విమర్శలు ఎక్కుపెట్టింది. అంబేడ్కర్ స్ఫూర్తితో పని చేసే లక్షల మందిని అవమానించారని మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తన ముసుగు తొలగించుకుందన్నారు. దీనిపై స్పందించిన శివసేన... ఎన్డీఏలోని మిత్ర పక్షాలు ఈ వ్యాఖ్యలు సమర్థిస్తాయా అంటూ ప్రశ్నించారు. అంబేడ్కర్ పేరును బీజేపీ, కాంగ్రెస్ రాజకీయాల కోసం వాడుకుంటున్నాయని మాయావతి మండిపడ్డారు. 

Also Read: పెళ్లయిన 43 ఏళ్లకు రూ.3 కోట్లు భరణం ఇచ్చి మరీ భార్యకు విడాకులు - పాపం ఈ పెద్దాయన ఎంత టార్చర్ అనుభవించారో ?

AIతో వక్రీకరించారు: అమిత్‌షా

అంబేడ్కర్‌పై తాను చేసిన కామెంట్స్‌ను వక్రీకరించి విమర్శలు చేస్తున్నరాని అమిత్‌షా అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆయనపై ప్రేమ లేదన్నారు. తమపై ద్వేషంతో ఇదంతా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అంబేడ్కర్‌కు వ్యతిరరేకంగా మాట్లాడలేదన్నారు. కాంగ్రెస్ అంబేడ్కర్ వ్యతిరేకి అని రిజర్వేషన్లకు, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమన్నారు. బీజేపీని టార్గెట్ చేయడానికి అబద్ధాలు ప్రచారం చేస్తోందని అన్నారు. తన వ్యాఖ్యలను AI ఉపయోగించి మార్చి ప్రచారం చేశారంటున్నారు."మీడియాకు రిక్వెస్ట్ చేస్తున్నా నా పూర్తి ప్రసంగం టెలికాస్ట్ చేయండి. ఆ ఒక్క మాటనే ట్విస్ట్ చేసి టెలికాస్ట్ చేస్తున్నారు. మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ప్రజలకు నిజం తెలియాలి. బీజేపీ ఎప్పటికీ అంబేడ్కర్ ను అవమానించదు..అవమానించలేదని అన్నారు. 

సమర్థించిన మోదీ

అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను మోదీ సమర్ధించారు. కాంగ్రెస్‌ చీకటి చరిత్రను బహిర్గతం చేశారని కితాబు ఇచ్చారు. అంబేడ్కర్ వారసత్వాన్ని రూపుమాపి, ఎస్సీ, ఎస్టీలను కించపరచడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని అన్నారు. వాళ్లు చేసే డర్టీ ట్రిక్స్ ప్రజలు గమనిస్తున్నారని పోస్టు చేశారు. 

అంబేడ్కర్‌ను అవమానిస్తే దేశం సహించదన్నారు రాహుల్ గాంధీ. అమిత్‌షా క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎంపీ ప్రియాంక కూడా స్పందించారు. అంబేడ్కర్ పేరు ప్రస్తావించడాన్ని గౌరవంగా భావిస్తామన్నారు. అమిత్‌షాను మోదీ సమర్థించడాన్ని కేజ్రీవాల్ తప్పుపట్టారు. గాయం మీద ఉప్పు చల్లినట్లుందని అన్నారు. పదే పదే కాంగ్రెస్ తప్పు చేసిందిని చెబుతున్న బీజేపీ చేస్తున్నదేంటని ప్రశ్నించారు.

Also Read : జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్‌, ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చిన సైన్యం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana News: ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Amit Shah: అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP DesamAmitshah vs Rahul Gandhi Ambedkar Controversy | పార్లమెంటును కుదిపేసిన 'అంబేడ్కర్ కు అవమానం' | ABPఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana News: ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Amit Shah: అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
Balagam Mogilaiah: అనారోగ్యంతో 'బలగం' మొగిలయ్య కన్నుమూత... జానపద కళాకారుడు ఇకలేరు
అనారోగ్యంతో 'బలగం' మొగిలయ్య కన్నుమూత... జానపద కళాకారుడు ఇకలేరు
Weather Update Today: అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Look Back 2024: అన్నకు ఎదురెళ్ళిన బాణం.. షర్మిల 2024లో ప్లస్సు అదే.. మైనస్ అదే
అన్నకు ఎదురెళ్ళిన బాణం.. షర్మిల 2024లో ప్లస్సు అదే.. మైనస్ అదే
Jammu And Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్‌, ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చిన సైన్యం  
జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్‌, ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చిన సైన్యం  
Embed widget