Ayodhya Deepotsav 2024 Ram Lalla : ఈ దీపావళికి అయోధ్యలో అద్భుతం..అస్సలు మిస్సవకండి!
Ayodhya Deepotsav 2024: అయోధ్య దీపోత్సవంలో ఈసారి 500 డ్రోన్‌లతో అద్భుతమైన షో ఉంటుంది. రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు , రావణ సంహారం వంటి ఆకృతులు ఆకాశంలో కనిపిస్తాయి.
Ayodhya Deepotsav 2024...25 Lakh Lamps: భక్తి, ఆధ్యాత్మికతకు ఆధునికత జోడించి దీపావళి వేడుకలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఏరియల్ డ్రోన్ షో కూడిన దీపోత్సవ నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది.
రామజన్మభూమి , బాలరాముడు కొలువైన అయోధ్యలో దీపావళి సంబరాలు అంబరంలో సెలబ్రేట్ చేయనుంది. ఆకాశవీధిలో కళ్లు మిరిమిట్లు గొలిపే రంగురంగుల లైట్లతో కూడిన ప్రదర్శనను 15 నిముషాల పాటు మేడ్ ఇన్ ఇండియా డ్రోన్ల సాయంతో ప్లాన్ చేసింది.
ఈ షో లో శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, హనుమంతుడి ముద్రలను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో లేజర్ లైట్లు, బ్యాగ్రౌండ్ లో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే వాయిస్ ఓవర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. వీటితో పాటూ రావణ సంహారం, పుష్పక విమానం, దీపోత్సవం, రామ దర్బార్, వాల్మీకి మహర్షి, తులసీదాస్ సహా మరెన్నో అధ్భుతాలను ప్రదర్శించనున్నారు.
Also Read: అక్టోబరు 29, 30 ఈ రెండు రోజులు సాయంత్రం ఈ దీపం వెలిగించడం మర్చిపోవద్దు!
బాలరాముని విగ్రహాన్ని అయోధ్య భవ్య మందిరంలో ప్రతిష్టించిన తర్వాత ఫస్ట్ టైమ్ జరుగుతున్న దీపావళి కావడంతో భారీగా ప్లాన్ చేసింది యూపీ ప్రభుత్వం. ఈ దీపోత్సవ కార్యక్రమంలో ఎలాంటి అపశ్రుతులు దొర్లకుండా అక్టోబరు 30 న నిర్వహించనున్న కార్యక్రమానికి ముందుగా రిహార్సల్స్ నిర్వహించనున్నారు. రామ్ కి పైడీ వద్ద ఈ షో ఉండబోతోంది.
మొత్తం 15 ఆకృతుల ప్రదర్శనలో భాగంగా ఈ పనులు పూర్తిచేసేందుకు యానిమేషన్ తో కూడిన స్టోరీబోర్డ్ సిద్ధం చేస్తున్నారు. ఆకాశంలో ప్లే అయ్యే ఆకృతులకు పర్ ఫెక్ట్ గా కాన్సెప్ట్, స్టోరీ, బ్యాగ్రౌండ్ వాయిస్/మ్యూజిక్ , లేజర్ లైట్స్ వర్క్స్ జరుగుతున్నాయ్. కేవలం షో మాత్రమే కాదు.. బాణసంచా కూడా కాల్చనున్నారు.
Also Read: అక్టోబరు 31 or నవంబరు 01..ఈ ఏడాది దీపావళి ఎప్పుడొచ్చింది - లక్ష్మీపూజ ముహూర్తం ఏంటి!
దక్షిణాదిన దీపావళి అంటే శ్రీకృష్ణడు సత్యభామ సమేతంగా నరకాసురిడిని సంహరించినందుకు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటారు. ఉత్తరాదిన ఇదే వేడుకను రావణ సంహారం అనంతరం శ్రీరాముడు సీతా,లక్ష్ణణ సమేతంగా అయోధ్యకు తిరికొచ్చిన సందర్భంగా జరుపుకుంటారు. రామచంద్రుడు అయోధ్యకు వచ్చిన రోజు అమావాస్య కావడంతో ఆ రోజు చీకటిని పారద్రోలేందుకు అయోధ్య వాసులంతా బాణసంచా కాల్చారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ ఏటా దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 2017 లో 51 వేల దీపాలు వెలిగించారు. 2019 లో 4.10 లక్షల దీపాలు, 2020 లో 6 లక్షల దీపాలు, 2021 లో 9 లక్షలకు పైగా దీపాలు వెలిగించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశారు.
Also Read: 5 రోజుల దీపావళి వేడుకలో ఏ రోజు విశిష్టత ఏంటి - ఏ రోజు ఏం చేయాలి!
2022 లో సరయూ నదీ తీరంలో ఉన్న రామ్ కీ పైరీలోని ఘాట్‌లలో 17 లక్షలకు పైగా దీపాలు వెలిగించారు.. గతేడాది (2023) అయోధ్యలో సరయూ నది ఒడ్డున ఉన్న రామ్ కీ పైరిపై 24 లక్షల దీపాలు వెలిగించారు. అనంతరం గ్రాండ్ గా సౌండ్ లైట్ అండ్ షో నిర్వహించారు. సరయూ నదికి ముందుగా హారతి ఇచ్చిన తర్వాత ఈకార్యక్రమం ప్రారంభించారు.