అన్వేషించండి

Diwali 2024: 5 రోజుల దీపావళి వేడుకలో ఏ రోజు విశిష్టత ఏంటి - ఏ రోజు ఏం చేయాలి!

Diwali 2024 Five Days Celebrations: వయసుతో సంబంధం లేకుండా అందరూ ఆసక్తిగా ఎదురుచూసే పండుగ దీపావళి. ఇంటి అలంకరణ, బాణసంచా సందడి, లక్ష్మీపూజ ఇలా ఒక్కొక్కరిది ఒక్కో సందడి..

Diwali Celebrations 2024 : రాక్షసత్వాన్ని అంతమొందించినందుకు గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి. ఆశ్వయుజ మాసం బహుళ అమవాస్య రోజు జరుపుకునే ఈ వేడుక  దీపావళి సెలబ్రేట్ చేసుకుంటారంతా. ధన త్రయోదశి to భాయ్ దూజ్  వరకూ మొత్తం ఐదు రోజుల పండుగలో ఏ రోజు ఏం చేస్తారు.. ఆరోజుకున్న విశిష్టత ఏంటో తెలుసుకుందాం..

Dai 1 - ధన త్రయోదశి ( Dhanteras 2024)

ఆశ్వయుజ బహుళ త్రయోదశినే ధన త్రయోదశి. ఈ రోజు బంగారు ఆభరణాలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఐశ్వర్యం వృద్ధి చెందుతుందని విశ్వసిస్తారు. ఈ రోజు బంగారం, వెండ కొనుగోలు చేయడాన్ని సెంటిమెంట్ గా భావిస్తారు. క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి ఉద్భవించిన రోజు ఇదేనని ఈ రోజు బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తే స్వయంగా లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించినట్టే అని భావిస్తారు. ఆరోగ్యాన్నిచ్చే ధన్వంతరీ పూజ కూడా ఈ రోజు చేస్తారు. 

Also Read: భారతదేశంలో వివిధ ప్రాంతాలలో దీపావళిని ఎలా జరుపుకుంటారు - దాన ధర్మాల్లో భాగంగా ఏమిస్తారు!
 
Dai 2 -నరక చతుర్దశి (Naraka Chathurdasi 2024)

ధన త్రయోదళి తర్వాత రోజు దీపావళికి ముందు వచ్చే ఆశ్వయుజ బహుళ చతుర్థశి నరక చతుర్థశిగా జరుపుకుంటారు. గతేడాది లానే ఈ ఏడాది కూడా నరక చతుర్ధశి, దీపావళి ఒకే రోజు వచ్చాయి. సూర్యోదయం సమయానికి నరక చతుర్థశి ఉంటే సూర్యాస్తమయం సమయానికి అమావాస్య ఉంది. దీంతో రెండు పండుగలు ఒకేరోజు జరుపుకుంటారు. ఈ రోజు నువ్వులనూనె రాసుకుని తలంటు పోసుకుంటే జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయని నమ్మకం. 

Dai 3 -దీపావళి అమావాస్య (Diwali 2024)

ఆశ్వయుజ మాసం ఆఖరి రోజు..కార్తీకమాసం ప్రారంభానికి ముందు రోజు దీపావళి జరుపుకుంటారు. ఉదయం నుంచి వివిధ రకాల వంటల తయారీ, ఇంటి అలంకరణలో ఉంటారు. సూర్యాస్తమయం సమయానికి ఘనంగా లక్ష్మీపూజ చేసుకుని ఇల్లంతా దీపాలు వెలిగిస్తారు. అనంతరం సీట్స్ పంచుకుని బాణసంచా వెలిగిస్తారు. దీపావళి రోజు లక్ష్మీ పూజ చేస్తే వ్యాపారం వృద్ధి చెందుతుని భావిస్తారు. 

Also Read: అక్టోబరు 31 or నవంబరు 01..ఈ ఏడాది దీపావళి ఎప్పుడొచ్చింది - లక్ష్మీపూజ ముహూర్తం ఏంటి!

Dai 4 - బలి పాడ్యమి (Balipratipada 2024)

దీపావళి అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యమిని బలిపాడ్యమి అంటారు. ఈ రోజు నుంచే కార్తీకమాసం ప్రారంభం. పాతాళం నుంచి బలిచక్రవర్తి భూమ్మీదకు వస్తాడంటారు. గుజరాతీలకు ఈ రోజు ఉగాది. శ్రీ కృష్ణుడు గోవర్థనగిరి ఎత్తి రేపల్లె ప్రజల్ని కాపాడిన రోజు కూడా ఇదే. 

Dai 5 - భాయ్ దూజ్  యమ విదియ ( Bhai Dooj / Yama Dwitiya 2024)

దీపావళి అమావాస్య మర్నాడు బలపాడ్యమి అయితే.. ఆ తర్వాత రోజు యమ విదియ. దీనినే ఉత్తరాదిన భాయ్ దూజ్ గా జరుపుకుంటారు. ఇంకా చెప్పాలంటే పురాణాల్లో రాఖీ పండుగ ఇది అని చెప్పుకోవచ్చు. కార్తీకమాసంలో రెండో రోజు వచ్చే ఈ రోజున యముడు స్వయంగా తన సోదరి ఇంటికెళ్లి భోజనం చేసి దీవెనలు అందించాడు.  సోదరీ, సోదరుల మధ్య ఆప్యాయతకు ఆదర్శం భాయ్ దూజ్. దీనినే భగనీహస్త భోజనం అని కూడా అంటారు.

Also Read: ధన త్రయోదశి రోజు బంగారం కొనాలా - ఈ రోజుకున్న విశిష్టత ఏంటి?

మొత్తం 5 రోజుల పాటూ దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఆయా ప్రాంతాలను బట్టి అనుసరించే పద్ధతులలో మార్పులుంటాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 RR VS CSK Result Update: రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
Andhra Pradesh News: ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
Pastor Praveen Pagadala Video: ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
Sanna Biyyam Scheme: సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RR vs CSK Match Highlights IPL 2025 | చెన్నై పై 6 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం | ABP DesamDC vs SRH Match Highlights IPL 2025 | సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఢిల్లీ క్యాపిటల్స్ గ్రాండ్ విక్టరీ | ABP DesamRR vs CSK Match Preview IPL 2025 | నేడు గువహాటిలో చెన్నసూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ | ABP DesamDC vs SRH Match Preview IPL 2025 | ఏ టీమ్ తెలుగు వాళ్లది..ఆటతో తేల్చేస్తారా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 RR VS CSK Result Update: రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
Andhra Pradesh News: ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
Pastor Praveen Pagadala Video: ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
Sanna Biyyam Scheme: సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
IPL 2025 SRH VS DC Result Update: స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
Sikandar Review - సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
Andhra Pradesh: గుడ్‌న్యూస్, రూ.2 వేల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
గుడ్‌న్యూస్, రూ.2 వేల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
Puri Jagannadh Vijay Sethupathi: పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ ఫిక్స్ - అధికారిక ప్రకటన వచ్చేసింది.. షూటింగ్ ఎప్పుడంటే?
పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ ఫిక్స్ - అధికారిక ప్రకటన వచ్చేసింది.. షూటింగ్ ఎప్పుడంటే?
Embed widget