Ayodhya Temple Priest Passes Away: అయోధ్య ఆలయ ప్రధాన అర్చకులు కన్నుమూత, మహా కుంభమేళా టైంలో తీవ్ర విషాదం
Ayodhya Priest Death News | అయోధ్య ఆలయ ప్రధాన అర్చకులు మహంత్ సత్యేంద్ర దాస్ బుధవారం ఉదయం కన్నుమూశారు.

Ayodhya Ram temple head priest passes away | లక్నో: అయోధ్య రామాలయం ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ కన్నుమూశారు. 85 ఏళ్ల ఆయన బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతున్నారు. అనారోగ్యంతో ఫిబ్రవరి నెలలోనే సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఆయన చేరారు. డాక్టర్స్ చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడంతో బుధవారం చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు అని సత్యేంద్ర దాస్ సన్నిహితులు తెలిపారు.
ప్రధాన పూజారిగా సత్యేంద్ర దాస్ రికార్డు
ఫిబ్రవరి 3న తీవ్ర అస్వస్థకు గురైన అర్చకులు సత్యేంద్ర దాస్‌ను హాస్పిటల్‌కు తరలించగా న్యూరాలజీ వార్డులో హై డిపెండెన్సీ యూనిట్‌లో చేర్చి చికిత్స అందించారు. కానీ ఆయన శరీరం వైద్యానికి సహకరించకపోవడంతో అయోధ్య ప్రధాన పూజారా కన్నుమూశారని హాస్పిటల్ తెలిపింది. బాబ్రీ మసీదు కూల్చివేసిన సమయంలో.. డిసెంబర్ 6, 1992న మహంత్ సత్యేంద్ర దాస్ తాత్కాలిక రామాలయానికి అర్చకులుగా ఉన్నారు. అయోధ్యా రామాలయానికి ఎక్కువ కాలం ప్రధాన పూజారిగా సేవలు అందించిన రికార్డు సైతం ఆయన పేరిట ఉంది.
परम रामभक्त, श्री राम जन्मभूमि मंदिर, श्री अयोध्या धाम के मुख्य पुजारी आचार्य श्री सत्येन्द्र कुमार दास जी महाराज का निधन अत्यंत दुःखद एवं आध्यात्मिक जगत की अपूरणीय क्षति है। विनम्र श्रद्धांजलि!
— Yogi Adityanath (@myogiadityanath) February 12, 2025
प्रभु श्री राम से प्रार्थना है कि दिवंगत पुण्यात्मा को अपने श्री चरणों में स्थान दे…
దాస్ మృతికి యోగి ఆదిత్యనాథ్ సంతాపం
అయోధ్య రామాలయం ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ మృతిపట్ల ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. సత్యేంద్ర దాస్ శ్రీరాముడికి పరమ భక్తుడు. శ్రీ రామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్ర కుమార్ దాస్ జీ మహారాజ్ మరణం చాలా బాధాకరం. ఆయన మృతి ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని లోటుగా పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఆయన శిష్యులు, అనుచరులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాకు మానసిక బలాన్ని ఇవ్వాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నానని యూపీ సీఎ యోగి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
నిర్వాణి అఖాడకు చెందిన సత్యేంద్ర దాస్ అయోధ్యలో ఎక్కువ కాలం నుంచి అందుబాటులో ఉండే సాధువులలో ఒకరు. అయోధ్యలో రామాలయం నిర్మాణం జరిగితే చూడాలని, రామయ్యకు పూజలు చేయాలని ఏళ్లుగా ఎంతో ఆశగా ఎదురుచూసిన ప్రధాన అర్చకులు ఆయన. గత ఏడాది అయోధ్యలో రామాలయంలో రాముడి పున:ప్రతిష్ట కార్యక్రమాలు సత్యేంద్ర దాస్ చేతుల మీదుగా జరిగాయి. ఆ విషయంలో ఆయన జీవితం ధన్యమైందని భావించారని విశ్వ హిందూ పరిషత్ అయోధ్యకు చెందిన ప్రతినిధి శరద్ శర్మ పీటీఐకి తెలిపారు.






















