రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎవరికి మేలు చేస్తుందో తెలీదు కానీ భారతీయులకు మాత్రం చుక్కలు చూపిస్తోంది. వంట నూనె ఇంట్లో మంట పెడుతోంది. ధరల పెరుగుదలను తట్టుకోలేక కస్టమర్లు లబోదిబో అంటున్నారు.
పొద్దుతిరుగుడు ముడి నూనెను ఎక్కువగా రష్యా, ఉక్రెయిన్ నుంచే భారత్ దిగుమతి చేసుకుంటోంది. యుద్ధం వల్ల సరఫరా దెబ్బతింది. దాంతో వంట నూనె ధరలు కొండెక్కాయి. ప్రస్తుతం లీటర్ వంటనూనె ధర సగటు రూ.200గా ఉంది.
కంపెనీని బట్టి 5 లీటర్ల నూనె డబ్బా రూ.1000 నుంచి 1300 వరకు ఉంటోంది. మున్ముందు ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో కస్టమర్లు ఇప్పుడే స్టాక్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నారు. దాంతో డీమార్ట్ వంటి స్టోర్లలో నూనె కొరత ఉంటోంది. ఐదు లీటర్ల డబ్బాలు అసలు కనిపించడం లేదు.
రాబోయే కాలంలో వంట నూనె ధర మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. లీటర్ నూనె ధర ఏకంగా రూ.250కి చేరుకున్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
తమ దేశంలో పెరిగిన నూనె ధరలను అదుపులో ఉంచేందుకు ఇండోనేసియా పామ్ ఆయిల్ ఎగుమతులను నిలిపివేసింది. భారత్ పామాయిల్ అవసరాలు అక్కడి దిగుమతుల ద్వారానే తీరుతాయి. ఇప్పుడు నిషేధం విధించడంతో మన దేశంలో ధరలు 10-15 శాతం పెరుగుతాయని అంచనా. అంటే సగటు వినియోగదారుడి పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది!! (All Images: pixabay)
Gold Investment: బంగారం కొనేటప్పుడు చేసే పెద్ద తప్పులివే! ఎన్ని రెట్లు నష్టపోతున్నారో చూడండి!
Loan from Google Pay: అర్జంట్‌గా డబ్బు కావాలా? గూగుల్ పేను అడగండి మరి!
Mutual Funds: పిల్లల పేరుతో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? కొత్త రూల్స్ ఇవీ!
Bank Holidays in May: మే నెల బ్యాంకు సెలవుల లిస్ట్ ఇదే! ఆ టైమ్‌లో బ్యాంకుకు వెళ్లకండి!
Multibagger Stock: రెండేళ్లలో రూ.లక్షకు రూ.18.25 లక్షల రిటర్న్ ఇచ్చిన మల్టీబ్యాగర్
Telangana Politics: మొన్న రాహుల్, నిన్న అమిత్ షా పర్యటనల ఉద్దేశమేంటీ ? జాతీయ పార్టీల టార్గెట్‌గా కేసీఆర్ !
World Hypertension Day: హైబీపీలో కనిపించే లక్షణాలు ఇవే, ఇలా అయితే వెంటనే వైద్యుడిని కలవాల్సిందే
Annamayya District: 23 మంది వలంటీర్లు, ఉద్యోగుల సస్పెండ్, మళ్లీ 3 రోజుల్లోనే తిరిగి డ్యూటీకి - అసలు ఏమైందో తెలుసా?
Vikram Movie: 'కెజియఫ్ 2'ను గుర్తు చేసిన కమల్ హాసన్ 'విక్రమ్' ట్రైలర్