Retro Release Date: సూర్య భాయ్... 'రెట్రో' రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాడోయ్!
Suriya Retro Movie Release Date: కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న సినిమా రెట్రో. రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందో తెలుసా?
భాయ్... సూర్య భాయ్... గ్యాంగ్‌స్టర్ పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య శివ కుమార్ (Suriya Sivakumar) యాక్ట్ చేసిన సినిమా 'రెట్రో' (Retro Movie). ఆల్రెడీ విడుదల చేసిన లుక్స్, వీడియో గ్లింప్స్ అభిమానులతో పాటు ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాయి. మరి, ఈ సినిమా థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందో తెలుసా?
మే 1న థియేటర్లలోకి సూర్య 'రెట్రో'
Retro Movie Release Date: సూర్య 44వ సినిమా 'రెట్రో' (Suriya 44). ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరో, దర్శకుడు కలయికలో మొదటి సినిమా ఇది. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకం మీద సూర్య స్వయంగా నిర్మిస్తున్న చిత్రమిది. 'Retro from May 1st' (మే 1వ తేదీ నుంచి థియేటర్లలో రెట్రో) అంటూ తన సోషల్ మీడియాలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు సూర్య.
ఇంటెన్స్ యాక్షన్, రొమాన్స్ , ఎమోషనల్ అంశాలతో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా 'రెట్రో' రూపొందుతోంది. ఇందులో సూర్య సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయికగా నటిస్తోంది. ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తే... ఆమె పాత్రకు మంచి ప్రాముఖ్యం ఉన్నట్లు అర్థం అవుతోంది.
The ONE from May ONE 🔥#RETROFromMay1 #LoveLaughterWar ❤️🔥@Suriya_Offl @karthiksubbaraj @hegdepooja @Music_Santhosh @prakashraaj @C_I_N_E_M_A_A @rajsekarpandian @kaarthekeyens @kshreyaas @cheps911 @jacki_art #MayaPandi @JaikaStunts @sherif_choreo @PraveenRaja_Off #Jayaram… pic.twitter.com/iGEMv5v6gh
— 2D Entertainment (@2D_ENTPVTLTD) January 8, 2025
'రెట్రో' కథకు వస్తే... సూర్య ఒక గ్యాంగ్ స్టర్. అయితే... పూజా హెగ్డే పాత్ర పరిచయం తర్వాత అతనిలో మార్పు వస్తుంది. కాశీలోని ఒక ఘాట్ మీద కూర్చున్న సూర్య చేతికి పూజా హెగ్డే ఒక తాడు కడతారు. 'నేను కోపం తగ్గించుకుంటా' అని హీరో చెబుతారు. తన తండ్రితో కలిసి పని చేయడం కూడా మానేస్తానని అంటాడు. ఆ తర్వాత సూర్య గతాన్ని రివీల్ చేశారు. ఆయన పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ అనేది అర్థం అవుతుంది.
సూర్య తండ్రి కూడా రౌడీ అనేది టీజర్ చూస్తే అర్థం అవుతోంది. రౌడీయిజం, ఆ గూండాయిజం, నేర ప్రపంచంలో భాగం కానని పూజా హెగ్డేకు ప్రామిస్ చేసిన తర్వాత సూర్య జీవితంలో ఏం జరిగింది? అనేది సినిమాలో చూడాలి. వయలెన్స్, యాక్షన్, అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే అంశాలు సినిమాలో చాలా ఉన్నాయని టీజర్ బట్టి అర్థం అవుతోంది.
సూర్య, పూజా హెగ్డే జంటగా... జయరామ్, కరుణాకరన్, జోజు జార్జ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'రెట్రో' సినిమాకు రాజశేఖర్ కర్పూర సుందర పాండియన్, కార్తికేయ సంతానం (స్టోన్ బెంచ్ ఫిల్మ్స్) సహా నిర్మాతలు. ఈ చిత్రానికి కూర్పు: మహమ్మద్ షఫీక్ అలీ, ఛాయాగ్రహణం: శ్రేయాస్ కృష్ణ, సంగీతం: సంతోష్ నారాయణన్,రచన - దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్, నిర్మాతలు: జ్యోతిక - సూర్య.