Fake Customer Care Calls: ఫేక్ కస్టమర్ కేర్ కాల్స్‌ను ఇలా గుర్తించండి - వీడియో రిలీజ్ చేసిన ప్రభుత్వం!
Indian Govermnent: నకిలీ కస్టమర్ కేర్ కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు ఒక వీడియోను కూడా విడుదల చేసింది.
Cyber Security: పెరుగుతున్న సైబర్ మోసాల గురించి ప్రభుత్వం నిరంతరం ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. దీనికి సంబంధించిన మెసేజ్‌లు కూడా ఇప్పుడు కాలర్ ట్యూన్‌లలో ప్లే అవుతున్నాయి. ఇందులో సైబర్ మోసాన్ని నివారించే మార్గాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. ఇప్పుడు టెలికమ్యూనికేషన్స్ విభాగం కూడా నకిలీ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. వారిని గుర్తించే మార్గాలను చెప్పింది. ఇందుకోసం ఆ శాఖ ఓ వీడియోను కూడా విడుదల చేసింది.
View this post on Instagram
ఈ విషయాలను గుర్తుంచుకోండి
డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన వీడియోలో నకిలీ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లను గుర్తించడానికి అనేక మార్గాలు వివరించారు. డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన వీడియోలో నిజమైన కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లు ఎప్పుడూ ఓటీపీ, బ్యాంక్ ఖాతా వివరాలు లేదా ఏదైనా సెన్సిటివ్ సమాచారాన్ని అడగరని లేదా వారు మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయడానికి ఎటువంటి ఏపీకే ఫైల్స్‌ను పంపరని చెప్పారు. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ పేరుతో ఎవరైనా వ్యక్తిగత సమాచారాన్ని అడిగినా, ఏపీకే ఫైల్‌లను పంపుతున్నట్లయితే, ఎవరైనా జాగ్రత్తగా ఉండాలి.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?
అదేవిధంగా నిజమైన కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లు రిమోట్ యాక్సెస్ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేయాల్సిందిగా వినియోగదారులను ఎప్పటికీ అడగరు. వారు ఎల్లప్పుడూ సురక్షితమైన, విశ్వసనీయ మార్గంలో కస్టమర్‌లకు సహాయం చేస్తారు. అటువంటి అధికారులు ఎల్లప్పుడూ కంపెనీ అధికారిక ఛానెల్ ద్వారా సంప్రదిస్తారు.
వాస్తవానికి గత కొంతకాలంగా మోసగాళ్లు నకిలీ కస్టమర్ కేర్ ఆఫీసర్లుగా నటిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలాంటి మోసాలలో ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడూ కంపెనీ అధికారిక కస్టమర్ కేర్‌ను సంప్రదించండి. గూగుల్‌లో ఇచ్చిన నంబర్‌లను గుడ్డిగా విశ్వసించవద్దు. సంబంధిత కంపెనీ వెబ్‌సైట్ నుంచ వాటిని నిర్ధారించండి. అలాగే మాట్లాడేటప్పుడు, మీ వ్యక్తిగత సమాచారాన్ని వారికి ఇవ్వవద్దు. అనుమానాస్పద లేదా తెలియని వ్యక్తి నుంచి వచ్చిన లింక్‌పై క్లిక్ చేయవద్దు. ప్రస్తుతం మనదేశంలో రోజుకో కొత్త సైబర్ క్రైమ్ వెలుగు చూస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Indian Telecom's Global Prominence
— DoT India (@DoT_India) December 31, 2024
India hosted World Telecommunication Standardization Assembly (WTSA) with record participation of 3,700+ delegates from over 160 countries.
Inaugurated by Hon'ble Prime Minister @narendramodi, the event was held in India for the first time.… pic.twitter.com/hYc05jnZHY