AP Inter Exams 2025: ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
AP Inter First Year Exams ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. సంస్కరణల్లో భాగంగా ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
Andhra Pradesh Inter Exams | అమరావతి: ఏపీలో ఇంటర్ విద్యలో సంస్కరణలు చేపట్టారు. ఈ క్రమంలో ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఇంటర్ ఫస్టియర్ బోర్డ్ ఎగ్జామ్స్ ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్ విద్యలో సంస్కరణలు చేపడుతున్నాం. ఇంటర్ విద్యలో చాలా ఏళ్లుగా సంస్కరణలు జరగలేదు. ఈ క్రమంలో ఏపీలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేయాలని భావించాం. ఇక నుంచి నేరుగా రెండో సంవత్సరం ఇంటర్ విద్యార్థులకు మాత్రమే బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తాం.
జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి ఇంటర్మీడియెట్ విద్యలో సంస్కరణలు చేపట్టాం. 2024-25 నుంచి పదోతరగతిలో ఎన్సీఈఆర్టీ టెక్ట్స్ బుక్స్ ప్రవేశపెట్టారు. విద్యావేత్తల నుంచి, ఇంటర్ విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి విలువైన సలహాలు, సూచనలను ఆహ్వానిస్తున్నాం. సైన్స్, ఆర్ట్స్, ల్యాంగ్వేజ్ సబ్జెక్టుల్లో సంస్కరణలు అమలు చేస్తామని కృతికా శుక్లా వెల్లడించారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే ఫస్టియర్ ఎగ్జామ్స్ తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఇకపై 20 ఇంటర్నల్ మార్కులు
ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిలబస్ ఇకపై తెలుగుతో పాటు ఇంగ్లీషులో ఉంటుంది. ఇంటర్ లో ప్రతి సబ్జెక్టుకు ఇక నుంచి 20 ఇంటర్నల్ మార్కులుంటాయి. ఈ నెల 26 వరకు వెబ్ సైట్ లో తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ఇతర నిపుణులు ఎవరైనా తమ అభిప్రాయం చెప్పచ్చు. సంస్కరణలకు సంబంధించి మేం ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నాం. సబ్జెక్టు ఎక్స్పర్ట్ కమిటి సిలబస్ పై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఇంటర్ విద్యార్దులను ప్రపంచ స్థాయి పోటీ తట్టుకునే విధంగా తయారు చేయాలన్నదే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు.
సెకండియర్‌కు మాత్రమే బోర్డ్ పరీక్షలు
అయితే విద్యా సంస్కరణల్లో భాగంగా ఇదివరకే 7వ తరగతి విద్యార్థులకు బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేశారు. దాంతో నేరుగా పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రాయడంలో విద్యార్థులు ఆందోళన చెందేవారు. ఆపై టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ సైతం సాధారణ పరీక్షలా మారింది. ఇక ఇంటర్ వంతు వచ్చింది. ఇంటర్ ఫస్టియర్ బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేయడంతో కేవలం సెకండియర్ లో మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. సెకండియర్ ఎగ్జామ్ తరువాత ఎంసెంట్, నీట్ లాంటి ఎంటన్స్ టెస్టులు రాసి విద్యార్థులు ఇంజినీరింగ్ లేక ఎంబీబీఎస్, ఇతర సబ్జెక్టుల్లో ప్రొఫెసనల్ విద్య అభ్యసించనున్నారు.