HMPV tests cost: హెచ్ఎంపీవీ వైరస్ టెస్టులకు ఎంత ఖర్చు అవుతుంది ? ఎలాంటి ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంది ?
HMPV :హెచ్‌ఎంపీవీ వైరస్‌ని ఎదుర్గొనేందుకు భారత వైద్య రంగం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో టెస్టులకు ఎంత ఖర్చవుతాయి.. ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారన్న పూర్తి వివరాలు ఇవీ..
How much will HMPV tests cost: భారత్‌లో హెచ్‌ఎంపీవీ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. బెంగళూరులో రెండు, అహ్మదాబాద్, చెన్నై, సేలం, నాగపూర్‌లలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో అసలు ఈ వైరస్ నిర్దారణ పరీక్షలు, చికిత్సలకు ఎంత ఖర్చు అవుతుందన్న దానిపై చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అసలు ఈ వైరస్ ను ఎలా గుర్తించాలి.. ఎలాంటి సందర్భాల్లో టెస్టులు చేయించుకోవాలి.. ఎంత ఖర్చు అవుతుందన్నదానిపై పూర్తి వివరాలు ఇవి.
హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ (హెచ్ఎంపివి) అంటే ...
హెచ్ఎంపివి అనేది ఒక సాధారణ శ్వాసకోశ వైరస్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ ప్రధాన లక్షణాలు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ముక్కులు పట్టేయడం. ఈ వైరస్ సోకిన వారు ఎక్కువ మంది తగినంత విశ్రాంతితోనే కోలుకుంటారు. శిశువులు, వృద్ధులు , బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారికి మాత్రం హెచ్‌ఎంపీవీ సమస్యలు సృష్టిస్తుంది.
HMPV టెస్టింగ్ , ఖర్చుల వివరాలు
హెచ్ఎంపివి వైరస్ పాజిటివా.. నెగెటివా అనేది టెస్టు చేయాలంటే బయోఫైర్ ప్యానెల్ వంటి అధునాతన రోగనిర్ధారణ పద్ధతులు అవసరం. ఇది హెచ్ఎంపివితో సహా బహుళ వ్యాధికారకాలను ఒకే పరీక్షలో గుర్తిస్తుంది. భారతదేశంలోని అనేక ప్రైవేట్ ల్యాబ్లు ఈ పరీక్షను అందిస్తున్నాయి. అయితే ఈ టెస్టు ఖర్చుతో కూడుకున్నది. డాక్టర్ లాల్ పాథ్ ల్యాబ్స్, టాటా 1ఎంజీ ల్యాబ్స్, మ్యాక్స్ హెల్త్‌కేర్ ల్యాబ్ వంటి ప్రముఖ ల్యాబ్‌లలో సాధారణ హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ ఆర్టీ పీసీఆర్ పరీక్ష రూ.3,000 నుంచి రూ.8,000 వరకు ఉంటుంది. హెచ్ఎంపివి, అడెనోవైరస్, కరోనావైరస్ 229 ఇ , కరోనావైరస్ HKU 1 తో సహా సమగ్రమైన టెస్టు కోసం మొత్తం రూ .20,000 వరకు ఖర్చు అవుతుందని చెబుతున్నారు.
హెచ్ఎంపివి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఆరోగ్యకరమైన వ్యక్తులలో, హెచ్ఎంపివి సాధారణంగా గొంతు నొప్పి, ముక్కుదిబ్బం, దగ్గు , తేలికపాటి జ్వరం ఉండే చాన్సులు ఉన్నాయి. వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులకు మాత్రం కరోనా తరహాలో ఈ వైర్స కూడా ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది. శ్వాస ఆడకపోవడం, న్యుమోనియాతో సహా తీవ్రమైన శ్వాసకోశ సమస్యలకు కారణం అయ్యే ప్రమాదాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. శిశువులకు, లక్షణాలు మరింత తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.
హెచ్ఎంపివి చికిత్సకు మందుల్లేవు !
ప్రస్తుతం హెచ్ఎంపివి చికిత్సకు నిర్దిష్ట యాంటీవైరల్ మందులు లేవు. తేలికపాటి లక్షణాలు ఉన్న చాలా మంది వ్యక్తులు విశ్రాంతితోనే కోలుకుటారు. లక్షణాలు తీవ్రమవుతుంటే సమస్యలను నివారించడానికి ఆసుపత్రిలో చేరాల్సి రావొచ్చు. లక్షణాలు తీవ్రమైతే ఆక్సిజన్ థెరపీ చేస్తారు. శ్వాసకు సహాయపడటానికి ఇది ఉపయోగపడుతుదంి. అలాగే ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్ కూడా ఇచ్చిరోగనిరోధక శక్తి పెంచుతారు.
మొత్తంగా హెచ్‌ఎంపీవీ తక్కువ రోగనిరోధక శక్తి ఉన్న వారికి సమస్యలు సృష్టిస్తుంది. వారు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
Also Read: అందరూ ఏడాదిలోపు చిన్నారులే - మహారాష్ట్రలో 3 - భారత్ లో 9కి చేరిన హెచ్‌ఎంపీవీ కేసులు