అన్వేషించండి

First HMPV Case in Mumbai : అందరూ ఏడాదిలోపు చిన్నారులే - మహారాష్ట్రలో 3 - భారత్ లో 9కి చేరిన హెచ్‌ఎంపీవీ కేసులు

First HMPV Case in Mumbai : ముంబైలో ఆరు నెలల శిశువులో హెచ్ఎంపీవీ వైరస్ మొదటి కేసు నమోదైంది. దీంతో మహారాష్ట్రలో మొత్తం హెచ్‌ఎంపీవీ కేసుల సంఖ్య 3కి చేరింది.

First HMPV Case in Mumbai : ఓ పక్క హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (Human Metapneumovirus)తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నప్పటికీ.. మరో పక్క కేసులు పెరుగుతుండడం కలకలం సృష్టిస్తోంది.  తాజాగా ముంబైలో మొదటి కేసు నమోదైంది. దీంతో మహారాష్ట్రలో హెచ్ఎంపీవీ కేసుల సంఖ్య 3కి చేరుకోగా.. దేశంలో 9కి చేరింది. దగ్గుతో పాటు 84శాతం ఆక్సిజన్ లెవల్స్ పడిపోయిన ఓ 6 నెలల చిన్నారిని ఆస్పత్రిలో చేర్చారు. చికిత్సలో భాగంగా చిన్నారికి ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించగా హెచ్ఎంపీవీ(HMPV) పాజిటివ్ గా నిర్థారణ అయినట్టు వైద్యులు తెలిపారు. ఈ వైరస్ కు ఇప్పటివరకూ ఎలాంటి వ్యాక్సిన్ గానీ, సరైన చికిత్స లేదు. కావున చిన్నారిని ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ చేస్తున్నామన్నారు. ఐదు రోజుల తర్వాత ఈ చిన్నారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని చెబుతున్నారు. మరోపక్క ఈ కేసుకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ చెబుతోంది. ఇన్ఫ్లుఎంజా, తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల కోసం నిఘా పెంచినట్లు తెలిపింది.

అంతకుముందు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో రెండు హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. వారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, చికిత్స తర్వాత ఇంటికి పంపించారని అధికారులు తెలిపారు. వారి నమూనాలను సేకరించి ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)కి పంపినట్టు సమాచారం. ఇక ఇప్పటివరకు, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లోనూ ఈ వైరస్ కు సంబంధించిన కేసులు నమోదు కావడం అంతటా భయాందోళనలను సృష్టిస్తోంది.

వైరస్ బారిన పడుతోన్న చిన్నారులు

ఇటీవలి కాలంలో భారత్ లో నమోదైన కేసులను బట్టి చూస్తే.. వారంతా ఏడాదిలోపున్న చిన్నారులే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో పిల్లలతో పాటు వృద్ధులు కూడా జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచిస్తున్నారు. మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించడం, పరిశుభ్రత పాటించడం వంటి నివారణలు చాలా అత్యవసరమని చెబుతున్నారు. నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తతతో వ్యవహరించాలని అంటున్నారు. కేసులు పెరుగుతున్నప్పటికీ అంత తీవ్రత ఉండకోవచ్చన్నది అధికారులు చెప్తున్న మాట. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాలు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేశాయి. 

  • జన ప్రవాహం ఉన్న ప్రదేశాల్లో తిరగరాదు. ఒక వేళ అత్యవసరం అయితే మాస్క్ తప్పనిసరిగా ధరించాలి.
  • తరచుగా చేతులను సబ్బు లేదా శానిటైజర్ తో కడుక్కోవాలి.
  • ముక్కు, నోరు, కళ్లను తరచూ తాకకూడదు.
  • బహిరంగ స్థలాల్లో ఉమ్మివేయరాదు.
  • జబ్బు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. తీవ్రమైన పక్షంలో వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.
  • శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్స్ ఉన్న వారు వాడిన వస్తువులను వేరుగా ఉంచాలి.
  • పోషకాహారాన్ని తీసుకోవాలి. బయటి ఫుడ్ కు దూరంగా ఉండాలి.

Also Read : Sankranthi Holidays: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఈసారి ఎన్నిరోజులంటే?

టాప్ హెడ్ లైన్స్

Donald Trump Impeachment Possibility: కాంగ్రెస్‌పై విపక్షాల పట్టు - ట్రంప్‌కు ఇంపీచ్‌మెంట్ గండం నిజమేనా.. అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?
కాంగ్రెస్‌పై విపక్షాల పట్టు - ట్రంప్‌కు ఇంపీచ్‌మెంట్ గండం నిజమేనా.. అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?
Hyderabad News: బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
AP MPTC ZPTC Election Results: ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా ఎన్నికల ఫలితాలు
ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా MPTC, ZPTC Results
Work From Park: వర్క్ ఫ్రమ్ హోమ్‌కు గుడ్‌బై.. ఇక వర్క్‌ ఫ్రమ్ పార్కు.. సైబరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ సరికొత్త ఆలోచన!
వర్క్ ఫ్రమ్ హోమ్‌కు గుడ్‌బై.. ఇక వర్క్‌ ఫ్రమ్ పార్కు.. సైబరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ సరికొత్త ఆలోచన!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MPTC ZPTC Election Results: ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా ఎన్నికల ఫలితాలు
ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా MPTC, ZPTC Results
Hyderabad News: బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
Low Fibre Risks : ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
Real World Mileage: కొత్త Honda City Hybridలో ఫుల్ ట్యాంక్‌తో 750km ప్రయాణించవచ్చా? రియల్‌ వరల్డ్‌లో ఎంత మైలేజ్ ఇస్తోంది?
2026 హోండా సిటీ హైబ్రిడ్ నిజమైన మైలేజ్ ఎంత? సిటీలో, హైవేపై 'రియల్ టెస్ట్‌'లో తెలిసిన నిజాలు
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Gym Beginner Guide : జిమ్ మొదటిసారి జాయిన్ అయ్యేవారు చేయకూడని తప్పులు ఇవే.. ఆ మిస్టేక్స్ చేయకండి
జిమ్ మొదటిసారి జాయిన్ అయ్యేవారు చేయకూడని తప్పులు ఇవే.. ఆ మిస్టేక్స్ చేయకండి
Petrol Saving Tips: మైలేజ్ పెంచుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.. ఇలా చేస్తే మీ ఖర్చులు తగ్గుతాయి !
మైలేజ్ పెంచుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.. ఇలా చేస్తే మీ ఖర్చులు తగ్గుతాయి !
Telangana CID Dharani Land Scam : ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
Embed widget