AP Inter Board on First year Exams | ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల రద్దుకై ప్రజాభిప్రాయం కోరిన బోర్డు | ABP Desam
ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా నాలుగు కీలక ప్రతిపాదనలను ఇంటర్ బోర్డు సిద్ధం చేసి ప్రజలు, నిపుణులు, తల్లితండ్రుల నుంచి అభిప్రాయాలు, సలహాలు,సూచనలు కోరింది. ప్రధానంగా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల రద్దు పై ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి సంవత్సరం నుంచి ఎన్సీఆర్టీ సిలబస్ ప్రవేశపెట్టడం, ఇంగ్లీషు, లాంగ్వేజ్ తో పాటు మరో సబ్జెక్ట్ ను ఎంచుకునే అవకాశం విద్యార్థులకు ఇవ్వటం లాంటి కీలక ప్రతిపాదనలను ఏపీ ఇంటర్ బోర్డు ప్రజల ముందు ఉంచింది. ప్రజల నుంచి అభిప్రాయాల సేకరణకు ఈ నెల 26 వరకూ తేదీని ప్రకటించింది ఇంటర్ బోర్డు. ఆ తర్వాత ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను సలహాలను సూచలను క్రోఢీకరించి ప్రభుత్వానికి సంస్కరణలపై తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించేలా ఇంటర్ బోర్డు ప్రణాళికలు రచించింది. ఫలితంగా విద్యార్థులపై ఒత్తిడి తగ్గి అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు విద్యార్థులకు ఆస్కారం దక్కనుంది.