Indias Largest Green Hydrogen Project | దేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ విశాఖలో | ABP Desam
దేశం మొత్తానికి గ్రీన్ ఎనర్జీ ఇచ్చే భారీ ప్రాజెక్ట్ జనవరి 8న ప్రారంభం కాబోతోంది. లక్షా 81వేల కోట్ల పూడిమడక NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ NGEL, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు
ఇప్పుడు మనం వాడుతున్న పెట్రోల్, డీజిల్ ఇక ఉండదు. థర్మల్ స్టేషన్ల నుంచి వస్తున్న విద్యుత్ ఉండకపోవచ్చు. భవిష్యత్ అంతా గ్రీన్ ఎనర్జీనే ఉండబోతోంది.ఇప్పటికే ఉత్పత్తి అవుతున్న రెన్యువల్ ఎనర్జీ సోర్సులు అయిన సోలార్, విండ్ పవర్‌లకు తోడుగా గ్రీన్ హైడ్రోజన్ రాబోతోంది. దీని ఉత్పత్తికి మన విశాఖపట్నం కేరాఫ్ అడ్రస్ కాబోతోంది. ఇండియాలో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్ విశాఖ సమీపంలోని పూడిమడక సమీపంలో నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ NTPC నిర్మిస్తోంది. లక్ష 81వేల కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయబోతున్న ఈ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు దేశం మొత్తానికి గ్రీన్ హైడ్రోజన్ హబ్ కానుంది.
కాలుష్యానికి కేరాఫ్‌గా మారుతున్న డీజిల్, పెట్రోల్ వాహనాలు స్థానంలో కొన్నేళ్లుగా ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. వాటి వినియోగం కూడా పెరిగిపోయింది. అయితే ఎలక్ట్రిక్ కన్నా మరింతగా ఉద్గారాలను తగ్గించే ఆల్టర్‌నేటివ్ గ్రీన్ హైడ్రోజన్. ఇప్పుటికే ప్రధాన నగరాల్లో డీజిల్ తో నడుస్తున్న పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ బస్సులను ఎలక్ట్రిక్ కు మారుస్తున్నారు. భవిష్యత్‌లో వీటిని పూర్తిగా హైడ్రోజన్ సెల్ ఫ్యూయల్ బస్సులుగా మారుస్తారు.