BCCI Desicion On Seniors: రోహిత్ వాదనను పట్టించుకోని బీసీసీఐ.. సీనియర్లపై వేటుకు రంగం సిద్ధం!
BCCI: టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించలేదని రోహిత్ క్లారిటీ ఇచ్చినప్పటికీ, బీసీసీఐ తన పని తాను చేసుకుపోతున్నట్లు తెలుస్తోంది. టీమిండియా టెస్టు జట్టులో తీసుకోబోయే మార్పులపై సెలెక్టర్లపై చర్చించనుంది.
Aus Tour Postmartum: ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ 3-1తో టెస్టు సిరీస్ కోల్పోయాక సీనియర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దాదాపుగా ఫైనల్ టెస్టు ఆడేశారనే చాలామంది భావిస్తున్నారు. ఇక రోహిత్ విషయంలోనో అయితే మెల్ బోర్న్ తోనే అతని టెస్టు కెరీర్ ముగిసిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే దీనిపై మ్యాచ్ సందర్భంగా స్పందించిన రోహిత్.. తాను రిటైర్మెంట్ ప్రకటించలేదని జట్టు ప్రయోజానాల రిత్యా విశ్రాంతి తీసుకున్నానని కవర్ చేసుకున్నాడు. అయితే బీసీసీఐ మాత్రం రోహిత్ వాదనను పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది. వచ్చే ఆదివారం జరిగే ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో బోర్డు తాత్కాలిక కార్యదర్శి దేవజిత్ సైకియా పూర్తి స్థాయిలో పగ్గాలు చేపట్టడం ఖాయంగా మారింది. ఇక ఆస్ట్రేలియా పర్యటన గురించి సెలెక్షన్ కమిటీ హెడ్ అజిత్ అగార్కర్ తో కలిసి సమీక్షను సైకియా చేసే అవకాశముందని తెలుస్తోంది. సీనియర్లపై వేటుకే మొగ్గు చూపవచ్చని తెలుస్తోంది.
పేలవ ఫామ్ లో రోహిత్..
కొడుకు పుట్టడం కారణంగా తొలి టెస్టుకు దూరమైన రోహిత్.. ఆసీస్ సిరీస్ లో మూడు టెస్టులు ఆడాడు. అందులో ఆరు సగటుతో కేవలం 31 పరుగులే చేశాడు. రెండు, మూడు టెస్టుల్లో ఆరో నెంబర్లో బ్యాటింగ్ చేసిన హిట్ మ్యాన్.. ముచ్చట పడి నాలుగో టెస్టులో ఓపెనర్ గా బరిలోకి దిగాడు. అయినా లక్కు కలిసి రాలేదు. రెండు ఇన్నింగ్స్ ల్లోనూ విఫలమయ్యాడు. దీంతో అతడిని విశ్రాంతి పేరిట టీమ్ మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. అయితే తానింక రిటైర్మెంట్ ప్రకటించలేదని రోహిత్ మొత్తుకుంటున్నప్పటికీ, బోర్డు అతని వాదన పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది. సెలెక్షన్ కమిటీ ద్వారా సీనియర్లపై వేటు వేసే అవకాశముందని తెలుస్తోంది. నిజానికి ఐదో టెస్టులో విజయం సాధించడం ద్వారా ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ రేసులో టీమిండియా ఉంటుందని అంతా భావించారు. ఆ టెస్టులో ఓడిపోవడంతో ఆ ఆశలు గల్లంతయ్యాయి. దీంతో సీనియర్లపై వేటుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
అగార్కర్ తో చర్చలు..
అధికారికంగా బోర్డు కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత సైకియా అసైన్మెంట్ ఆసీస్ టూర్ పై రివ్యూ ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ సిద్ధమైందని, సీనియర్లపై వేటు తప్పదని తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతానికైతే భారత్ టెస్టు సిరీస్ ఆడబోవడం లేదు. వచ్చే జూన్ నుంచి ఇంగ్లాండ్ లో భారత్ పర్యటించనుంది. ఆ పర్యటనలో ఐదు టెస్టులు ఆడనుంది. ఈ పర్యటన ద్వారా 2027 ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ రేసును ఆరంభిస్తుంది. ఈ టెస్టు సిరీస్ జట్టు ప్రకటన వరకు ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశముంది. అంతకుముందు వచ్చేనెలలో జరిగే చాంపియన్స్ ట్రోపీలో భారత్ పాల్గొననుంది. నిజానికి ఈ ట్రోఫీ మొత్తం పాకిస్తాన్ లో జరుగుతుండగా, భారత్ ఆడే మ్యాచ్ లు మాత్రం దుబాయ్ లో జరుగుతాయి. టోర్నీలో తొలి మ్యాచ్ పాక్- న్యూజిలాండ్ మధ్య జరుగుతుండగా, ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తో పోరు ద్వారా భారత్ టైటిల్ వేటను ప్రారంభిస్తుంది.
Also Read: AB de Villiers Comments: ఐపీఎల్లో ఆ రూల్ నాకు నచ్చలేదు బాస్.. ఆల్ రౌండర్ల పాలిట శాపమని 360 డిగ్రీ ప్లేయర్ డివిలియర్స్ వ్యాఖ్యలు