Actress Divi Vadthya : క్రిస్మస్ రోజు అభిమానులకు బాడ్ న్యూస్ చెప్పిన దివి... ఆమె కాలికి ఏమైందంటే?
Actress Divi Vadthya : నటి దివి తన కాలికి గాయం అయ్యిందనే విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి ఫోటోల ద్వారా వెల్లడించింది.
Actress Divi : బిగ్ బాస్ కంటెస్టెంట్, నటి దివి తాజాగా తన అభిమానులకు బాడ్ న్యూస్ చెప్పింది. క్రిస్మస్ రోజున కాలికి ఓ పెద్ద కట్టువేసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి షాక్ ఇచ్చింది. అయితే ఆ గాయం ఎక్కడ, ఎలా అయ్యింది అనే విషయాన్ని మాత్రం ఆమె సస్పెన్స్ లో పెట్టింది.
దివి కాలికి గాయం...
దివి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆ ఫోటోలలో కాలికి తీవ్ర గాయమైనట్టు కనిపిస్తోంది. అంత పెద్ద కట్టు వేసి ఉండడంతో అసలు ఆమెకేమైందని ఆందోళన చెందుతున్నారు అభిమానలు. ఇక ఈ ఫోటోలలో కాలికి కట్టిన కట్టుపై స్కెచ్ తో బొమ్మలు వేసుకుంటుంది దివి. ఆ పోస్టులో "మన పనికి కాలు మీద వేసిన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కట్టు కొన్నిసార్లు అడ్డుగా నిలుస్తుంది. అయినంత మాత్రాన ఎంటర్టైన్మెంట్ ను ఎందుకు ఆపాలి ? అందుకే ఈ కట్టును ఏదో అడ్డుగా భావించకుండా, దానిపైనే ఈ విధంగా బొమ్మలు గీస్తూ మరింత అందంగా తయారు చేస్తున్నాను.
జీవితం అంటే కష్టాలను తప్పించుకుని తిరగడం కాదు ఇలాంటి సమయంలో కూడా నవ్వడమే. అందుకే నేను ఈరోజు ఇలా ఉన్నాను. నా లైఫ్ లో ప్రతి సెకండ్ ని ఆస్వాదిస్తున్నాను. ఇక అందరికీ క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు. ప్రతి విషయంలోనూ ఆనందాన్ని వెతుక్కుందాం" అంటూ రాసుకు వచ్చింది. అయితే దివి అసలు ఆ గాయం ఎందుకు, ఎక్కడ, ఎలా అయింది అనే విషయాన్ని మాత్రం సస్పెన్స్ లో పెట్టింది. ఆమె చేసిన ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారగా, నెటిజెన్లు ఆ కాలికి ఏమైంది? ఎందుకు అంత పెద్ద కట్టువేశారు ? అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా జాగ్రత్తగా ఉండాలని, ప్రస్తుతం రెస్ట్ తీసుకోమని కోరుతున్నారు.
View this post on Instagram
బిగ్ బాస్ తెచ్చిన ఫేమ్
ఇదిలా ఉండగా, దివి గతంలో పలు సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్స్ లో మెరిసింది. కానీ ఆ సినిమాలేవి మంచి గుర్తింపును తీసుకురాలేకపోయాయి. కానీ బిగ్ బాస్ మాత్రం ఆమెకు మంచి పాపులారిటీని తెచ్చి పెట్టింది. బిగ్ బాస్ విన్నర్ కాకపోయినా, అందులో దీవి ఉన్నన్ని రోజులు బాగానే ఆడింది. పైగా ప్రేక్షకుల మదిని గెలుచుకొని మంచి ఫేమ్ తెచ్చుకుంది. బిగ్ బాస్ -4 హౌస్ లో ఉన్నప్పుడు ఆమె అందానికి సమంత కూడా ఫిదా అయింది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె కెరియర్ పూర్తిగా మారిపోయింది.
చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే, మరోవైపు పెద్ద సినిమాలలో కీలకమైన క్యారెక్టర్లు చేస్తోంది. వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్న ఈ ముద్దుగుమ్మ వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. రీసెంట్ గా 'హరికథ' అనే వెబ్ సిరిస్ తో హాట్ స్టార్ లో ప్రేక్షకులను పలకరించింది. ఇక సినిమాలు, సిరీస్ లు మాత్రమే కాదు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ ఎప్పుటికప్పుడు ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.
Also Read: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే... ఎవరెవరు ఉన్నారో తెలుసా