అన్వేషించండి

Nandyal News: కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?

Transgender Love:నంద్యాలలో ఓ జంట ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి కారణం వారి కుమారుడు ప్రేమలో పడటమే. అమ్మాయిని ప్రేమిస్తే కులమో.మతమో అయినా సర్దుకుపోయేవారేమో కానీ కొడుకు ట్రాన్స్ జెండర్ ను ప్రేమించాడు.

Andhra couple die by suicide after son refuses to end relationship with transgender :    కూతురు వేరే కులం వాడితో లేచిపోయిందని ఆత్మహత్య చేసుకునే తల్లిదండ్రుల్ని చూసి ఉంటాం. కొడుకు అమ్మాయిని తీసుకెళ్లిపోయాడని పరువు తక్కువగా భావించి ఆత్మహత్య చేసుకునే వాళ్ల గురించి వార్తలు చూసి ఉంటాం. అయితే నంద్యాలలో మాత్రం ఓ జంట సూసైడ్ ఇప్పటి వరకూ ఎవరూ విననిది. తన కొడుకు లవ్ చేశాడని ఎంత వద్దన్నా వినడం లేదని.. ఆ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు.

నంద్యాలలో ఆటోడ్రైవర్ గా సునీల్ అనేయువకుడు పని చేస్తున్నాడు. బీ టెక్ పూర్తి చేసినా ఉద్యోగాల కోసం పెద్దగా ప్రయత్నించలేదు. ఆటో నడుపుతున్నాడు. కొడుకు ఇంజనీరింగ్ చేసినా ఆటో నడుపుతున్నాడని ఆ తల్లిదండ్రులు బాధపడుతూ ఉండేవారు.అయితే తనకు ఇదే  ఇష్టం అని ఈ పనే చేసుకుంటానని చెబుతూ ఉండేవాడు. దాంతో ఆ తల్లిదండ్రులు వాడి రాత అంతే సర్దుకుపోయారు. అయితే హఠాత్తుగా సునీల్ ప్రేమలో పడ్డాడని తెలిసింది. కానీ ఆ విషయం తెలిసి వారి గుండెలు జారిపోయాయి. ఎందుకంటే సునీల్  ప్రేమలో పడింది అమ్మాయితో కాదు.. ట్రాన్స్ జెండర్ తో.  స్మిత అనే ట్రాన్స్ జెండర్ తో సునీల్ కు జరిగిన పరిచయం ప్రేమగా మారింది . 

Also Read: Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్

ట్రాన్స్ జెండర్ ను పెళ్లి చేసుకోవడానికి సునీల్ సిద్దమయ్యారు. అయితే ఆ తల్లిదండ్రులు మాత్రం కొడుకు మనసు మార్చేందుకు చాలా ప్రయత్నం చేశారు సమాజంలో  చులకన  అవుతామని ఎంతో చెప్పి చూశారు.  కానీ సునీల్ మాత్రం తన ప్రేమనుఏ మాత్రం తగ్గించుకునేది లేదని తాను స్మితను పెళ్లి చేసుకుని తీరుతానని ప్రకటించారు. దాంతో ఆ తల్లిదండ్రులు..  ట్రాన్స్ జెండర్లు ఎక్కువగా ఉండే ప్రాంతానికి వెళ్లి స్మిత గురించి ఆరా తీశారు.  ఆమెకు సంబంధించిన వారితో మాట్లాడారు. అయితే అక్కడా వారికి తిరస్కారమే ఎదురయింది. వారు ప్రేమించుకుంటున్నారు.. పెళ్లి చేసుకుంటారని మధ్యలో అడ్డు రావొద్దని వారు చెప్పి పంపేశారు. 

Also Read : వ్యాపారి నుంచి రూ.7.5 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు - సిమ్ స్వాప్ స్కామ్ నుంచి జాగ్రత్త గురూ

తమ కుమారుడు తమ మాట వినడం లేదని..  ట్రాన్స్ జెండర్ ను పెళ్లి చేసుకుంటే ఊళ్లోవాళ్లు అంతా తమను మరో రకంగా చూస్తారన్న ఉద్దేశంతో ఆ తల్లిదండ్రులు కుమిలిపోయారు. చివరికి ప్రాణం తీసుకోవాలని నిర్ణయించుకుని.. ఉరి వేసుకున్నారు.  ఈ ఇద్దరి ఆత్మహత్య నంద్యాలలో సంచలనం సృష్టించింది. కుమారుడు తనకు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తాడని దానికి వీరు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని ఎక్కువ మంది నిట్టూరుస్తున్నారు. మొత్తంగానికి ట్రాన్స్ జెండర్ ప్రేమ కారణంగా సునీల్ తన తల్లిదండ్రుల్నికూడా కోల్పోయాడు. 

వీరి ఆత్మహత్యపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో కేసులు నమోదు కాలేదని పోలీసులు చెబుతున్నారు.         

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Embed widget