అన్వేషించండి

Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్

Crime News: స్నేహితులు మోసం చేయడంతో ఓ ప్రధానోపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురంలో జరిగింది. హెడ్మాస్టర్ సూసైడ్ నోట్ పోలీసులుక చిక్కింది.

Head Master committed suicide after being cheated by his friends In Anantapur: మనతో బాగా ఉండే వాళ్లంతా మిత్రులు కాదు. మిత్రులుగా ఉండి మోసం చేసేవారు ఎక్కువగా ఉండొచ్చు. వారిని అతిగా నమ్మతే ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అనంతపురంలోని ఈ హెడ్మాస్టర్ కు అదే పరిస్థితి ఏర్పడింది. 

షేర్ మార్కెట్ పేరుతో డబ్బులు తీసుకున్న స్నేహితులు 

అనంతపురంలో హెడ్మాస్టర్ ఆత్మహత్య ఘటన సంచలనగా మారింది. షేర్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడి లాభం తిరిగి ఇవ్వలేదంటూ హెడ్మాస్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన అందర్నీ కలచివేసింది. అనంతపురం నగరంలోని బళ్ళారి రోడ్డులో నివాసం ఉండే భాస్కర్ బాబు గత కొంతకాలంగా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాడు. ఈయన డి హీరే హాల్ మండలం మల్లికేతి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో హెడ్మాస్టర్ గా పనిచేస్తున్నారు.  ఇద్దరు వ్యక్తులను నమ్మి షేర్ మార్కెట్లో భారీగా పెట్టుబడులు పెట్టాడు. 

Also Read: Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి

కంబదూరు కు చెందిన తన స్నేహితులు శ్రీనివాసులు అతని  మిత్రుడు బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన నరేష్ కుమార్ రెడ్డి అనంతపురంలో షేర్ మార్కెట్, ఆన్లైన్ బిజినెస్ నడుపుతున్నారు. వీటిలో మంచి లాభాలు వస్తాయని భాస్కర్ బాబుకు వెల్లడించారు. స్నేహితులు చెప్పిన దానికి నమ్మిన భాస్కర్ బాబు బ్యాంకులు, యాప్ ల ద్వారా.. మరియు బయట వ్యక్తులతో అప్పు తీసుకొని 60 లక్షలు పెట్టుబడి పెట్టారు. దీనికి ప్రామిసరీ నోట్లు, చెక్కు పుస్తకం ఇచ్చారు. కొన్ని రోజులు లాభం పేరుతో భాస్కర్ బాబు కి డబ్బులు ఇస్తూ వచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అతని పెట్టుబడుకు సంబంధించి ఎలాంటి లాభం అసలు ఇవ్వకుండా కార్యాలయం చుట్టూ తిప్పుకున్నారు.  బయట తెచ్చిన అప్పులు వడ్డీలు పెరిగిపోతూ ఉండడంతో మనోవేదనకు గురయ్యాడు. ఎన్నిసార్లు తన మిత్రులను సంప్రదించిన కూడా వారు పట్టించుకోలేదు. E M I లు, బయట వ్యక్తులతో తీసుకున్న అప్పులు పెరిగిపోవడంతో బ్యాంకు సంబంధించిన వ్యక్తులు బయట అప్పులు ఇచ్చిన వ్యక్తులు తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. 

Also Read: Viral Video : ఈ కంపెనీలో బాస్ వస్తున్నాడంటే చాలు.. ఉద్యోగులు ఈ పని చేయాలట

అప్పుల బాధ భరించలేక కుడేరు మండలం కమ్మూరు సమీపంలో ఉన్న అగ్రిగోల్డ్ వెంచర్ వద్ద సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అటుగా వెళుతున్న కొందరు స్థానికులు భాస్కర్ బాబును చూసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. తన మిత్రులు గాజుల శ్రీనివాసులు, నరేష్ కుమార్ రెడ్డి ల నుంచి 60 లక్షలు ఇప్పించి తన కుటుంబానికి న్యాయం చేయాలని సూసైడ్ నోట్ ద్వారా మృతుడు పోలీసులకు కోరాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

 

టాప్ హెడ్ లైన్స్

UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget