అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ అయ్యప్ప స్వామి భక్తుడిపై మరో వర్గానికి చెందిన ఓ వ్యక్తి దాడి చేశాడు. స్వామి మాలలో ఉన్న వ్యక్తిపై దాడి చేయడం స్థానికంగా అలజడి రేపింది. బండి రోడ్డుకు అడ్డంగా ఉందని, పక్కకు పెట్టాలని అడిగినందుకు కోపంతో మీద పడ్డాడు. అయ్యప్ప మాలలో ఉన్న వ్యక్తి దుస్తులను చింపేశాడు నిందితుడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే... పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు గుమిగూడారు. బస్టాండ్ వద్ద నిరసన చేపట్టారు. వీళ్లతో పాటు హిందూ సంఘాలు కూడా నిరసనలో పాల్గొనడం వల్ల ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కొన్ని చోట్ల స్కూల్స్‌లోనూ అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థులను యాజమాన్యాలు అడ్డుకుంటున్నాయి. స్వామి మాల వేసుకుని స్కూల్‌కి రావద్దని తేల్చి చెబుతున్నాయి. దీనిపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు మండి పడుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఇక మదనపల్లి ఘటనలో ఓ వర్గానికి చెందిన యువకుడు ఈ దాడి చేశాడని స్థానికులు చెబుతున్నారు.