Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Chandrababu Meets PM Modi: విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపనకు ప్రధానమంత్రిని ఆహ్వానించిన ఏపీ సీఎం చంద్రబాబు పెండింగ్ ప్రాజెక్టు అంశాన్ని కూడా కదిలించారు. పోలవరం నిధులు అంశాన్ని ప్రస్దావించారు.
Andhra CM Chandrababu Naidu Meets PM Modi In New Delhi: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు వీళ్లిద్దరి సమావేశం సాగింది. పెండింగ్ అంశాలకు త్వరగా పరిష్కారం చూపాలని మోదీని రిక్వస్ట్ చేశారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మోదీకి చంద్రబాబు వివరించారు. చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి తెలిపారు. వచ్చే ఫిబ్రవరిలో పెట్టే బడ్జెట్‌లో మరింత ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గత బడ్జెట్‌లో కేటాయించిన వివిధ ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలా చూడాలని సూచించారు.
వైజాగ్ రైల్వే జోన్ శంకుస్థాపనకు రావాలని ప్రధానమంత్రి మోదీని చంద్రబాబు ఆహ్వానించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ నిధుల కేటాయింపులు వంటి కీలక అంశాలను ఆయనతో చర్చించారు. వరద సెస్‌కి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తికి ప్రధానమంత్రి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
అంతకు ముందు ఎన్డీయే నేతలు దిల్లీలో భేటీ అయ్యారు. బీజేపీ నేషనల్ ప్రెసిడెండ్ జేపీ నడ్డా నివాసంలో ఈ సమావేశం జరిగింది. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్‌షాతోచంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది.
Also Read: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు