Coconut Water : కొబ్బరి నీరు ఇలా తాగితే ప్రాణాలు పోతాయి! సరైన విధానం తెలుసుకోండి!
Coconut Water : కొబ్బరి నీళ్లు ఎలా పడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు తాగితే ప్రాణాలకే ముప్పు- 69 ఏళ్ల వ్యక్తి అలానే పోయాడు. తప్పు తెలుసుకోకుంటే ముప్పు తప్పదు!

Coconut Water : వేసవి కాలంలో ఆరోగ్యకరమైన, అందుబాటులో ఉన్న అద్భుతమైన నేచురల్ డ్రింక్ కొబ్బరి నీళ్లు. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. మనం ఫ్రెష్‌గా ఉండేందుకు కూడా సహాయపడుతుంది. కానీ మీరు తాగే విధానంలో ఏమాత్రం తప్పు చేసినా అది మీ అనారోగ్యానికి కారణం కూడా కావచ్చు. అందుకే కొబ్బరి నీళ్లు తాగేటపట్టు ఇలాంటి తప్పులు చేయకండి.
ఎంత గొప్ప ఔషధమైన సరిగా వాడకపోతే ప్రయోజనం కలగపోగా నష్టం చేస్తుంది. కొబ్బరి నీళ్లు కూడా అంతే. వేసవిలో చాలా ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో కొబ్బరి నీళ్లు తాగేందుకు ఇష్టపడుతున్నారు. రసాయనాలు కలిపే పానీయాల కంటే ఇదే ఉత్తమం అని ఆలోచిస్తున్నారు. అయితే ఈ కొబ్బరి నీళ్లు కూడా సరిగా తీసుకోకుంటే ముప్పు తప్పదని చాలా మందికి తెలియదు.
ఓ 69 ఏళ్ల వృద్ధుడు కొబ్బరి నీళ్లు తాగి మృతి చెందాడు. విచారించిన తర్వాత అసలు విషయం తెలిసింది. నిల్వ చేసిన కొబ్బరి నీళ్లు తాగడం వల్లే ప్రమాదంజరిగిందని కుటుంబ సభ్యులుతెలుసుకున్నారు. అందుకే ఎప్పటికప్పుడు ప్రెష్‌గా ఉండే కొబ్బరి నీళ్లను మాత్రమే తాగండి. నిల్వ ఉంచితే అందులే ఫంగల్ ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. దీని వల్ల అనారోగ్యం పాలవుతారు. ప్రాణాలు కూడా పోతాయి.
మీరు కొబ్బరిని కట్ చేస్తే, ఆ నీళ్లను వెంటనే తాగేయాలి. ఎప్పుడూ కట్ చేసిన కొబ్బరి నీళ్లను ఎక్కువ సేపు ఫ్రిజ్‌లో కానీ బయట కానీ నిల్వ ఉంచకూడదు. దీని వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుంది. అలాంటి నీరు తాగడం ప్రాణాంతకం.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, కట్ చేసిన కొబ్బరి నీటిని అలా వదిలేయడం ప్రమాదకరం కావచ్చు. వాతావరణంలోని తేమ, వేడి కారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ జరిగే అవకాశం ఉంది. దీని వల్ల మీకు అనేక రకాల సమస్యలు వస్తాయి. వాంతులు, వికారం, పొట్ట నొప్పి మొదలైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతే కాకుండా ఈ కట్ చేసి నిల్వ ఉంచిన కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఫుడ్-పాయిజనింగ్, డయేరియా వంటి తీవ్రమైన సమస్యలు కూడా రావచ్చు.
ఎలా నిల్వ చేయాలి
కట్ చేసిన కొబ్బరి నీటిని గాలి చొరబడని పాత్రలో జిప్‌లాక్ బ్యాగ్‌లో ఉంచి ఫ్రిజ్‌లో నిల్వ చేయండి. కానీ దాన్ని 2 నుంచి 3 రోజుల లోపల తాగేయాలి. దాన్ని అంతకంటే ఎక్కువ రోజులు నిల్వ చేయడం కూడా ప్రమాదకరం కావచ్చు.
కొబ్బరి నీరు తాగడానికి సరైన విధానం ఏమిటి?
కొబ్బరి నీటిని కట్ చేసి వెంటనే తాగాలి. ఉదయం ఖాళీ కడుపుతో కొబ్బరి నీరు తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా వర్కౌట్ తర్వాత లేదా వేసవిలో బయట నుంచి వచ్చినప్పుడు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇది మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఎలక్ట్రోలైట్‌లను సమతుల్యం చేస్తుంది.
కొబ్బరి నీళ్లలో తక్కువ కేలరీలు, అధిక ఎలక్ట్రోలైట్లు, కొవ్వు తక్కువగా ఉంటుంది. దీని వల్ల మీ బరువు తగ్గడం వేగంగా జరుగుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే, కొబ్బరి నీటిని క్రమం తప్పకుండా మోతాదులో తాగండి. దీని వల్ల జీర్ణక్రియ కూడా బాగుపడుతుంది.
గమనిక : వార్తలో ఇచ్చిన కొంత సమాచారం మీడియా నివేదికల ఆధారంగా ఉంది. మీరు ఏదైనా సూచనను అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

