Viral Video : దారి తప్పుతున్న జంటలు - బెంగళూరు మెట్రో కూడా ఢిల్లీ మెట్రోలా మారుతోందా ?
Metro Love : యువ జంటలు హద్దు మీరి ప్రవర్తించడం ఢిల్లీలో మెట్రోలో తరచూ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడీ సంస్కృతి బెంగళూరుకు కూడా పాకినట్లుగా కనిపిస్తోంది.

Bengaluru metro : ఢిల్లీ మెట్రోలో యువతీ , యువకుల బహిరంగ రొమాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఈ సారి బెంగళూరు మెట్రో స్టేషన్ లో ఇలాంటి ఓ వీడియో వైరల్ అయింది. మెట్రో ఎక్కడానికి ఎక్కడానికి వేచి ఉన్ ఓ జంట అసభ్యంగా ప్రవర్తించారు. ఓ వ్యక్తి చాటు నుంచి ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.
this is not USA or London 🫣#Bangalore Metro station had gone wild.. no sh@me no cultures no humanity... 😰#HelicopterCrash #RoohAfza #MSDhoni #SunnyDeol #DelhiCapitals #KaranKundrra #RamCharan pic.twitter.com/NgkQM75XvD
— Melawan (@melawanshwa) April 11, 2025
మాదవర మెట్రో స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. యువతీ యువకులు ఇద్దరూ ఒకరి వెనుక ఒకరు నిలబడి ఉన్నారు. యువకుడు ఆ యువతి షర్టులోకి చేయి చొప్పించి అసభ్య ప్రవర్తనకు పాల్పడ్డారు. ప్రయాణికులు వారి దగ్గర నిలబడి ఉన్నప్పటికీ, ఆ జంట ఈ అసభ్యకరమైన చర్యకు పాల్పడ్డారు. ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమయింది.
No one can see, no one knows why he is doing this, she could be anxious and he is helping her feel comfortable, she could be pregnant and having pains so he is comforting her, there is no nudity or sexual behaviour, recording is probably the weirdest part, get on with your lives.
— Michael Leigh (@Michael87588745) April 11, 2025
చాలా మంది జంట ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని, బహిరంగ ప్రదేశాలు అందరికీ సురక్షితంగా, శుభ్రంగా ,గౌరవప్రదంగా ఉండేలా చూసుకోవాలని అధికారులను కోరుతూ పోస్టులు పెట్టారు.
కొంతమంది వ్యక్తులు బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శిస్తున్న ప్రవర్తనను చూడటం ఆందోళన కలిగిస్తుందని నెటిజన్లు ని పోస్ట్ పేర్కొంది. ఇటువంటి చర్యలు మెట్రో స్టేషన్ వంటి బహిరంగ ప్రదేశంలో పూర్తిగా ఆమోదయోగ్యం కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వారి చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల గౌరవం లేని కొంతమంది వ్యక్తుల వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని అనుకుంటున్నారు. ఈ యువతీ, యువకులు సిగ్గు, మర్యాద లేకపోవడం వారి మానసిక స్థితిని ప్రతిబింబిస్తోందని అంటున్నారు.
కొంత మంది మాత్రం ఆ జంటకు సమస్య లేనప్పుడు వీడియో రికార్డు చేసి ఎందుకు వరైల్ చేస్తున్నరని ప్రశ్నిస్తున్నారు.
Abe chutiye if both of them don’t have any problem , and they are feeling being loved than why do you guys even care . You are getting hurt for what ???? Actually you and the video recorder should be ashamed for shaming them for what ???
— Haris 📈 (@chartblueprint) April 12, 2025





















