Heart Attack Survival : హార్ట్ఎటాక్ వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
Heart attack recovery : గుండెపోటు వచ్చిన తర్వాత కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఉంటే.. సమస్యను దూరం చేసుకోవడం, తగ్గించుకోవడం సాధ్యమవుతుందని చెప్తున్నారు. ఇంతకీ అవి ఏంటంటే..

Life after a heart attack : గుండెపోటు ఇప్పుడు కామన్ అయిపోయింది. చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు అందరూ గుండె సమస్యలు ఎందుర్కొంటున్నారు. ముఖ్యంగా యువతలో ఈ సంఖ్య పెరుగుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే చెప్తుంది. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు గుండెపోటు ప్రధాన కారణంగా ఉందని.. ఏటా 17.9 మిలియన్ల మంది ప్రాణాలు హార్ట్ఎటాక్ వల్లనే పోతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో గుండెపోటు గురించి పలు విషయాలపై అవగాహన కల్పించింది.
గుండెపోటు ఎలా వస్తుందంటే..
గుండె కండరాలకు రక్త ప్రవాహం నిలిచిపోయినప్పుడు గుండెపోటు సంభవిస్తుంది. కొరోనరీ ఆర్టరీలో ఏర్పడే రక్తం గడ్డ కట్టి.. గుండెకు రక్తాన్ని సరఫరా చేయడాన్ని అడ్డుకుంటుంది. దీనివల్ల గుండె కండరాలకు తగినంత ఆక్సిజన్, పోషకాలు అందవు. దీనివల్ల హార్ట్ఎటాక్ సంభవించవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కావొచ్చు. అయితే ఒకసారి గుండెపోటు వస్తే తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో, నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటో చూద్దాం.
ఆ టైమ్‌లో జాగ్రత్త..
గుండెపోటు వచ్చిన తర్వాత రికవరీ టైమ్ అనేది చాలా కీలకమైనదిగా చెప్తారు. ఎందుకంటే.. రక్తప్రవాహంలో జరిగిన నష్టాన్ని సరిచేయడానికి గుండె చురుకుగా పనిచేస్తుంది. కాబట్టి దానికి మద్ధతునిచ్చేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత విశ్రాంతిని శరీరానికి అందించాలి. వైద్యుల సూచనలు కచ్చితంగా ఫాలో అవ్వాలి.
మెడిసన్స్..
వైద్యులు సూచించిన మందులు రెగ్యులర్‌గా తీసుకోవాలి. ఇవి రక్తం గడ్డకట్టడాన్ని కంట్రోల్ చేసి.. యాంటీప్లేట్లెట్లు, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. హృదయ స్పందన రేటు, రక్తపోటును తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.
డైట్లో మార్పులు
గుండె సంరక్షణలో ఫుడ్ కీలకపాత్ర పోషిస్తుంది. కాబట్టి పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు పుష్కలంగా తీసుకోవచ్చు. సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్స్, సోడియం, షుగర్స్‌ని కట్ చేస్తే మంచిది.
వ్యాయామం
వైద్యులు సూచించిన తేలికపాటి వ్యాయామాలు గుండెను బలోపేతంగా మారుస్తాయి. లో ఇన్టెన్సిటీ వ్యాయామాలు.. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బరువును అదుపులో ఉంచుకోవడంలో హెల్ప్ చేస్తుంది.
ఒత్తిడి
దీర్ఘకాలిక ఒత్తిడి గుండెపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి మెడిటేషన్, డీప్ బ్రీత్, యోగా వంటివి ఒత్తిడిని కంట్రోల్ చేసి.. విశ్రాంతిని ఇస్తాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తాయి.
స్మోకింగ్..
గుండె జబ్బులకు స్మోకింగ్ ప్రధాన ప్రమాద కారకం. కాబట్టి భవిష్యత్తులో గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి స్మోకింగ్ చేయకపోవడమే మంచిది.
మరిన్ని జాగ్రత్తలు
ఫ్రెండ్స్, ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోవాలి. CPR గురించిన అవగాహన ఉండాలి. ఇది ప్రాణాలు కాపాడడంలో హెల్ప్ చేస్తుంది. గుండె జబ్బులు, దాని ప్రమాద కారకాల గురించి తెలుసుకోవాలి. ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. ఇతర ఆరోగ్య సమస్యలుంటే కచ్చితంగా వాటిని మెడిసన్స్‌ను వైద్యుల సూచనల మేరకు తీసుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.






















