Arjun Son Of Vyjayanthi Trailer: ఆయుధంలా పెంచి యుద్ధం చెయ్యొద్దంటే ఎలా? - 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ట్రైలర్ అదుర్స్
Arjun Son Of Vyjayanthi: కల్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ట్రైలర్ తాజాగా విడుదలైంది. కల్యాణ్ రామ్ మాస్ యాక్షన్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

Kalyan Ram's Arjun Son Of Vyjayanthi Trailer Unvieled: టాలీవుడ్ యంగ్ హీరో నందమూరి కల్యాణ్ రామ్ (Kalyan Ram), లేడీ సూపర్ స్టార్ విజయశాంతి (Vijayashanti) తల్లీకొడుకులుగా నటించిన లేటెస్ట్ మూవీ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' (Arjun Son Of Vyjayanthi). తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన లుక్స్, సాంగ్స్, టీజర్ సినిమాపై భారీగా హైప్ పెంచేయగా అంతకు మించి అనేలా ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
ట్రైలర్ ఎలా ఉందంటే?
సినిమాలో కల్యాణ్ రామ్ మాస్ యాక్షన్ అదిరిపోయింది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా విజయశాంతి నటిస్తుండగా.. ఆమె ఫైట్స్, యాక్షన్ వేరే లెవల్ అనేలా ఉన్నాయి. నిజాయతీ గల ఓ పోలీస్ ఆఫీసర్ తన కొడుకును కూడా పోలీస్ ఆఫీసర్‌గానే చూడాలని కలలు కంటుంది. అయితే, ఆమె కొడుకు అర్జున్ ఓ క్రిమినల్‌గా కనిపించబోతున్నట్లు టీజర్, ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.
1 టూ 10 ఒక్కడే అర్జున్
సిటీలో ఉన్న రౌడీ షీటర్స్, గ్యాంగ్ స్టర్స్ క్రిమినల్స్ టాప్ 10 లిస్ట్ కావాలని పోలీస్ ఆఫీసర్ అడగ్గా.. ఇక్కడ టాప్ టెన్ ఉండదు సార్.. వన్ టూ టెన్ ఒక్కడే అర్జున్.. అంటూ కల్యాణ్ రామ్ మాస్ ఎలివేషన్స్‌తో సాగే ట్రైలర్ ఆకట్టుకుంటోంది. విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కాగా.. మీ కింద పని చేయాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు.. కానీ మీ పెంపకంలో పెరిగిన మీ కొడుకు అర్జున్ ఏంటి మేడమ్.. క్రిమినల్‌గా మారాడు. అంటూ చెప్పే డైలాగ్స్ హైప్ పెంచేశాయి. 'కొడుకును ఆయుధంలా పెంచి యుద్ధం చెయ్యొద్దంటే ఎలా మేడమ్' వంటి డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.
స్టోరీ ఏంటో?
తల్లి వైజయంతి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కాగా.. కొడుకు అర్జున్‌ను గొప్ప పోలీస్ ఆఫీసర్‌ను చేయాలని కలలు కంటుంది. అయితే, కొడుకు మాత్రం ఓ గ్యాంగ్ స్టర్‌గా మారుతాడు. అసలు, కొడుకు గ్యాంగ్ స్టర్‌గా ఎందుకు మారాడు?, కొడుకును పోలీస్ ఆఫీసర్ చేయాలన్న ఆ తల్లి కల నెరవేరిందా?, అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే. మాస్ యాక్షన్‌తో పాటు తల్లీకొడుకుల సెంటిమెంట్ ఎలివేషన్స్ ట్రైలర్‌పై మరింత ఆసక్తిని పెంచేశాయి. విజయశాంతి ఫైట్స్, కల్యాణ్ రామ్ మాస్ ఎలివేషన్స్ సినిమాకే హైలెట్‌గా నిలవనున్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.
Here it is… https://t.co/6vKiAhK5ls
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) April 12, 2025
See you in theatres from APRIL 18th. #ASOVTrailer#ArjunSonOfVyjayanthi
Also Read: 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో ప్రియా ప్రకాశ్ వారియర్ - కన్ను గీటడానికి మించి డ్యాన్స్ అదిరిపోయిందిగా..
ఈవెంట్‌కు ఎన్టీఆర్
ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. ఈలలు, కేకలతో సందడి చేశారు. సీఎం, సీఎం అంటూ నినాదాలు చేశారు.
ఈ నెల 18న రిలీజ్
ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించగా.. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై అశోక్ వర్థన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. మూవీలో సోహైల్ ఖాన్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ కీలకపాత్రలు పోషించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు. ఈ నెల 18న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.





















