Sasivadane OTT : మరో ఓటీటీలోకి విలేజ్ క్యూట్ లవ్ స్టోరీ 'శశివదనే' - రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్
Sasivadane OTT Platform : రీసెంట్ విలేజ్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'శశివదనే' తాజాగా మరో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఒక ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా ఇప్పుడు 2 ఓటీటీల్లో వచ్చింది.

Rakshit Atluri's Sasivadane OTT Streaming : రీసెంట్ విలేజ్ క్యూట్ లవ్ స్టోరీ 'శశివదనే' మరో ఓటీటీలోకి వచ్చేసింది. 'లండన్ బాబులు', 'పలాస' మూవీస్‌తో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో రక్షిత్ శెట్టి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన లవ్ ఎంటర్టైనర్ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఒక ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా మరో ఓటీటీలోకి సైతం అందుబాటులోకి వచ్చింది.
రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్
ప్రముఖ ఓటీటీ 'సన్ నెక్స్ట్'లో గత నెల 28 నుంచి స్ట్రీమింగ్ అవుతుండగా తాజాగా... 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లోనూ అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం నుంచి మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించగా... రక్షిత్, కోమలి ప్రసాద్‌లతో పాటు దీపక్ ప్రిన్స్, శ్రీమాన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఫేమస్ కాస్ట్యూమ్ డిజైనర్ గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్‌వీఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మించారు.
Also Read : తండ్రయిన టాలీవుడ్ హీరో తిరువీర్ - సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ
స్టోరీ ఏంటంటే?
రాఘవ (రక్షిత్ అట్లూరి)ది గోదావరి జిల్లాలోని ఓ గ్రామం. తల్లి లేని అతన్ని ప్రేమగా పెంచి పెద్ద చేస్తాడు తండ్రి (శ్రీమాన్). డిగ్రీ కంప్లీట్ చేసిన రాఘవ పీజీ పూర్తి చేసేందుకు రెడీ అవుతుంటాడు. తన తండ్రిలాగే లవ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్న రాఘవ అనుకోకుండా ఓ రోజు శశి (కోమలీ ప్రసాద్)ను చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమె ప్రేమ పొందడం కోసం చుట్టూ తిరుగుతుంటాడు. చివరకు శశి కూడా రాఘవను ఇష్టపడుతుంది. అయితే, వీరిద్దరి ప్రేమ కథకు తలత్తిన సమస్యలేంటి? పెళ్లి పీటలెక్కాల్సిన టైంలో రాఘవ హత్యా నేరం కింద జైలుకు వెళ్లడానికి కారణమేంటి? తన ప్రేమను పొందడంలో రాఘవకు ఎదురైన అనుభవాలేంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















