Thiruveer : తండ్రయిన టాలీవుడ్ హీరో తిరువీర్ - సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ
Thiruveer Good News : టాలీవుడ్ హీరో తిరువీర్ తండ్రయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో ఆయనకు విషెష్ వెల్లువెత్తుతున్నాయి.

Tollywood Actor Thiruveer Shares Good News To Fans : టాలీవుడ్ హీరో తిరువీర్ గుడ్ న్యూస్ చెప్పారు. తాను తండ్రి అయినట్లు సోషల్ మీడియా వేేదికగా శుభవార్తను పంచుకున్నారు. 'నాయన వచ్చిండు' అంటూ ఆనందం వ్యక్తం చేశారు. దీంతో తిరువీర్‌కు పలువురు సెలబ్రిటీలతో పాటు ఫ్యాన్స్, నెటిజన్లు విషెష్ చెబుతున్నారు.
తిరువీర్ గతేడాది కల్పన అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో సొంతూరిలో తన కొత్తింటి కలను నిజం చేసుకున్నారు. అప్పట్లో 'రెండు దశాబ్దాల కల, అమ్మ చివరి కోరిక' అంటూ తన ఇంటి ఫోటోలను నెట్టింట పంచుకున్నారు. ఆగస్టులో తన భార్య కల్పన సీమంతం వేడుక చేశారు. తాజాగా ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.
View this post on Instagram
Also Read : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
ఇక సినిమాల విషయానికొస్తే... తిరువీర్ రీసెంట్‌గా 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' మూవీతో మంచి హిట్ సొంతం చేసుకున్నారు. తొలుత సహాయ పాత్రలు చేస్తూ ఆ తర్వాత హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు తిరువీర్. 'మసూద'తో మంచి ఫేమ్ సంపాదించుకున్న ఆయన... ఘాజీ, మల్లేశం, పలాస, జార్జ్ రెడ్డి, టక్ జగదీష్, పరేషాన్, మోక్షపటం చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం భరత్ భూషణ్ దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర్ రెడ్డి మాలి మూవీని నిర్మిస్తుండగా... ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆ తర్వాత డైలాగ్ రైటర్ కృష్ణ చేపూరి దర్శకత్వంలో మరో మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 'బేబీ' ఫేం SKN ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమచారం.





















