Gold Price News: మరో వారంలో 10 గ్రాముల బంగారం ధర 1 లక్షకు చేరుకుంటుందా? నిపుణుల అభిప్రాయం ఏంటీ?
Gold Price News: గోల్డ్ ధరలు పెరుగుతున్నాయి. అమెరికా-చైనా పోటాపోటీ టారిఫ్ పెంపుదల కారణంగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో పది గ్రాముల పసిడి లక్ష రూపాయలకు చేరుకుంటుందా? అనే డౌట్ ఉంది.

Gold Price News: భారతదేశంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధానం కారణంగా మార్కెట్‌లో అల్లకల్లోలం నెలకొంది. దీంతో ప్రజలు సురక్షిత పెట్టుబడిగా బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 95,000 మార్కును దాటింది. అమెరికా, చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం వల్ల కలిగే అనిశ్చితి, కేంద్ర బ్యాంకు బంగారం కొనుగోలు, వడ్డీ రేట్లలో తగ్గింపు ఆశతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో 2025లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1 లక్షకు చేరుకుంటుందా అనే ప్రశ్న ప్రజల మనసుల్లో మెదులుతోంది?
బిజినెస్‌టుడే నివేదిక ప్రకారం, స్ప్రోట్ ఆస్తుల నిర్వహణ సంస్థ సీనియర్ పోర్ట్‌ఫోలియో మేనేజర్ రయాన్ మెక్‌ఇంటైర్, కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోలు, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధానం కారణంగా బంగారానికి బలం లభిస్తోందని అన్నారు.
భారతదేశంలో అన్ని వర్గాలలో బంగారం ధరలు పెరిగాయి-
- 24 క్యారెట్ల బంగారం: రూ. 93,390 (10 గ్రాములు)
- 22 క్యారెట్ల బంగారం: రూ. 85,610 (10 గ్రాములు)
- 18 క్యారెట్ల బంగారం: రూ. 70,050 (10 గ్రాములు)
ప్రపంచ స్థాయిలో బంగారం ధరలు మొదటిసారిగా ప్రతి ఔన్స్ 3,200 డాలర్లు చేరుకున్నాయి, అయితే అమెరికా బంగారం ఫ్యూచర్స్ ధర దానికంటే ఎక్కువగా 3,237.50 డాలర్లుకు చేరుకుంది. 2025లో మాత్రమే బంగారం 20సార్లు ఆల్ టైమ్ హై స్థాయికి చేరుకుంది, ఇది ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు విధానంలో మార్పుల భయాలతోనే ఇదంతా జరుగుతోంది.
ఇవాళ్టి ధరలు పరిశీలిస్తే
24 క్యారెట్ల బంగారం ధర- 95,583(నిన్నటి ధర-93,563) ఏప్రిల్1న ఈ ధరలు 92,093 రూపాయలుగా ఉండేది. 22 క్యారెట్ల బంగారం ధర -87,633 (నిన్నటి ధర-85,783) ఏప్రిల్1న ఈ ధరలు 84,433 రూపాయలుగా ఉండేది.
బెంగళూరులో 95,592 87,642
భువనేశ్వర్ 95,430 87,480
చెన్నై 95,576 87,626
కోయంబత్తూర్ 95,576 87,626
ఢిల్లీ 95,583 87,633
హైదరాబాద్ 95,439 87,489
కోల్‌కతా 95,435 87,485
ముంబై 95,437 87,487
మైసూర్ 95,592 87,642
పూణె 95,437 87,487
రూ. 1 లక్షకు చేరుకుంటుందా బంగారం?
కామా జ్యువెల్లరీ ఎండీ కాలిన్ షా మాట్లాడుతూ పది గ్రాముల బంగారం లక్షకు చేరుకునే ఛాన్స్ ఉందని నమ్ముతున్నారు. అమెరికా ఫెడ్ 2025లో రెండుసార్లు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని, దీని వల్ల బంగారం 10 గ్రాములకు రూ. 1 లక్షకు చేరుకుంటుందని ఆయన ది హిందూ బిజినెస్‌లైన్‌కు తెలిపారు. ఈ అనిశ్చితి వాతావరణంలో ప్రజలు బంగారంలో పెట్టుబడులు పెడుతున్నారని కాలిన్ షా అన్నారు.
మోతిలాల్ ఒస్వాల్ కమోడిటీ హెడ్ కిషోర్ నర్నే అంచనా వేస్తూ ఔన్సు ధరలు 4,000 నుంచి 4,500 డాలర్లు కూడా చేరుకుంటాయని అభిప్రాయపడ్డారు. అయితే, అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈఓ చింతన్ మెహతా బంగారం ధర రూ. 1 లక్షకు చేరుకునే అవకాశం తక్కువని అంటున్నారు. దీనికి అవసరమైన చాలా సానుకూల అంశాలు ఇప్పటికే మార్కెట్లో కనిపిస్తున్నాయని ఇకపై దాని పెరుగుదలకు అవకాశం లేదని అన్నారు. అదే సమయంలో, మార్నింగ్‌స్టార్ వ్యూహకర్త జాన్ మిల్స్ మరింత జాగ్రత్తగా వ్యవహరించారు. బంగారం ధరల్లో భారీ క్షీణతతో ఇది ఔన్స్ ధర 1,820 డాలర్లుకు చేరుకుంటుందని అంటున్నారు. అంటే ప్రస్తుత స్థాయిల నుంచి 38-40 శాతం వరకు తగ్గుదల ఉండవచ్చని ఆయన అన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

