Rohit Sharma Panic Delhi Thunderstorm | ముంబై మ్యాచ్ ప్రాక్టీస్ లో సుడిగాలి బీభత్సం
ముంబై ఇండియన్స్ సుడిగాలిలో చిక్కుకుపోయింది. ఢిల్లీతో మ్యాచ్ కోసం దేశరాజధానికి చేరుకున్న ముంబై ఇండియన్స్ జట్టు ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న సాయంత్రం ప్రాక్టీస్ చేస్తుండగా గాలి దుమారం బీభత్సం సృష్టించింది. ఢిల్లీని కమ్మేసిన గాలి దుమ్ముకు అరుణ్ జైట్లీ స్టేడియంలో పైన రేకులు ఎగిరిపోయి బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా వచ్చిన గాలిదుమారానికి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కంగారు పడిపోయాడు. మైదానంలో ఉన్న ఆటగాళ్లను వెనక్కి వచ్చేయాలంటూ పెద్దగా కేకలు వేశాడు. జహీర్ ఖాన్, మలింగ, జయవర్దనే గాలి దుమ్ములో ఇబ్బందులు పడుతూ పరిగెత్తుకు రావటం కనిపించింది. బోల్ట్ అయితే థండర్ బోల్ట్ వేగంతో పరుగులు పెడుతూ వచ్చాడు. రోహిత్ శర్మ మాట్లాడుతున్న వీడియోలో ఢిల్లీ స్టేడియంలో పైకప్పులు ఎగిరి గాల్లో కి వెళుతూ కనిపించటం అక్కడి పరిస్తితి ఆ సమంయలో ఎంత భయానకంగా ఉందో అర్థమయ్యేలా చేస్తోంది. ఢిల్లీ వ్యాప్తంగా వీచిన ఈ భీకర గాలులకు ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మరి ఆదివారం జరగబోయే మ్యాచ్ ఓకేనా లేదా తీవ్ర వర్ష సూచన ఉన్న కారణంగా మ్యాచ్ కు ఆటంకాలు ఏర్పడే అవకాశాలున్నాయా వేచి చూడాలి.





















