Bajaj CNG Bike: ప్రపంచంలోనే మొదటి CNG బైక్‌ను రూ.5 వేలకే ఇంటికి తెచ్చుకోండి, EMI లెక్క ఇదీ
Bajaj Freedom 125 CNG Features: బజాజ్ ఫ్రీడమ్ బైక్‌కు 125cc ఇంజిన్ బిగించారు. ఇది ఆశ్చర్యపరిచే పవర్‌తో పాటు మెరుగైన మైలేజీ ఇస్తుంది. సౌకర్యవంతమైన సీటింగ్‌తో బైక్ డిజైన్ చేశారు.

Buying Bajaj Freedom 125 Bike On EMI: ఇండియన్ వెహికల్ మార్కెట్‌లో ద్విచక్ర వాహనాలదే గణనీయమైన వాటా. ఎందుకంటే, బైక్‌లు ఆర్థికంగా చౌకగా ఉండటమే కాకుండా మంచి మైలేజీ కూడా ఇస్తాయి. ఇటీవల, బజాజ్ ఫ్రీడమ్ 125 లాంచ్ అయింది, అమ్మకాల పరంగా సంచలనం సృష్టించింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి CNG బైక్.
కొనగలిగే స్థాయిలో మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కోసం మీరు ఎదురుచూస్తుంటే, బజాజ్ ఫ్రీడమ్ 125 బెస్ట్ ఆప్షన్ అవుతుందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. బజాజ్ కంపెనీకి చెందిన ఈ CNG బైక్‌ను లోన్‌పై కొనాలనుకుంటే (Buying Bajaj Freedom 125 Bike On Bank Loan).. డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి, నెలవారీ EMI ఎంత చెల్లించాలన్న వివరాలను ముందుగా మీరు తెలుసుకోవాలి.
ఎంత డౌన్ పేమెంట్‌కు బజాజ్ ఫ్రీడమ్ 125 లభిస్తుంది?
దిల్లీలో, బజాజ్ ఫ్రీడమ్ 125 NG04 డ్రమ్ బైక్ ఎక్స్-షోరూమ్ ధర (Bajaj Freedom 125 CNG Bike Ex-Showroom Price, Delhi) రూ. 89,000 నుంచి ప్రారంభమవుతుంది. ఈ బైక్ ఆన్-రోడ్ ధర (Bajaj Freedom 125 CNG Bike On-Road Price) దాదాపు రూ. 1 లక్ష 08 వేలు. బైక్ దేఖో వెబ్‌సైట్ ప్రకారం, మీరు ఈ బైక్‌ను రూ. 5,000 డౌన్ పేమెంట్‌తో కొనుగోలు చేయవచ్చు.
ఎంత EMI చెల్లించాలి?
మీరు ఈ బైక్‌ను లోన్ పై కొనాలనుకుంటే, రూ. 5,000 డౌన్ పేమెంట్ తర్వాత, రూ. 1 లక్ష 03 వేల లోన్ తీసుకోవాలి. మీరు మూడేళ్ల కాలానికి 9.70 శాతం వడ్డీతో లోన్ తీసుకున్నారని అనుకుంటే, వడ్డీతో కలిపి మొత్తం లోన్ మొత్తం తిరిగి చెల్లించడానికి 3 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ. 3,326 EMI చెల్లించాలి. ఈ విధంగా, మీరు మొత్తం 1,19,736 రూపాయలు చెల్లించాలి. తీసుకునే లోన్ మొత్తం, వడ్డీ రేటు, కాల పరిమితిని బట్టి EMI మారుతుంది.
బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ ఫీచర్లు
బజాజ్ ఫ్రీడమ్ బైక్ శక్తివంతమైన 125cc ఇంజిన్‌తో ప్యాక్ అయి ఉంది, ఇది మెరుగైన శక్తిని విడుదల చేస్తుంది. ఈ బండి మంచి మైలేజీ కూడా ఇస్తుంది. యువతతో పాటు ఫ్యామిలీలను కూడా దృష్టిలో ఉంచుకుని బైక్‌ను ఆకర్షణీయంగా డిజైన్ చేశారు. కలర్‌ఫుల్ డిజిటల్ డిస్‌ప్లే, LED లైట్స్, సౌకర్యవంతమైన సీటింగ్ వంటి మరెన్నో ఫీచర్లతో ఈ బైక్‌ను తీర్చిదిద్దారు. సౌకర్యవంతమైన సీటింగ్ కోరుకునే వాళ్లకు మీకు మంచి ఆప్షన్ అవుతుంది.
బజాజ్ ఫ్రీడమ్ 125 మైలేజ్ (Bajaj Freedom 125 Bike Mileage)
ధర అందుబాటులో ఉండడంతో ఎక్కువ మంది ఈ బైక్‌ను ఇష్టపడుతున్నారు. కంపెనీ వెల్లడించిన ప్రకారం, ఈ బైక్ లీటరుకు 60 నుంచి 65 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది, మీ డబ్బును ఆదా చేస్తుంది.
ఎక్కువ సేపు & ఎక్కువ దూరం ప్రయాణించే వాళ్లకు...
డిజిటల్ డిస్‌ప్లే, LED లైట్లు, సౌకర్యవంతమైన సీటింగ్ కారణంగా ఎక్కువ సేపు ప్రయాణించేవాళ్లు & ఎక్కువ దూరం ప్రయాణించేవాళ్లకు ఈ బైక్ అనుకూలంగా ఉంటుంది. పెట్రోల్ మోడ్‌లో 130 కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది. CNGతో కూడా కలిపితే, మొత్తం 330 కిలోమీటర్ల దూరం తిరిగొచ్చని కంపెనీ పేర్కొంది. CNG ఆప్షన్ కారణంగా పొదుపు చేయడంలో బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ మీకు నేస్తం అవుతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

