CSK Dot Balls Tree Saplings | IPL 2025 సామాజిక సందేశ స్ఫూర్తి కోసం ఓడిపోతున్న చెన్నై
ఈ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా ఐదు మ్యాచులు ఓడిపోయింది. జరిగిన 17 ఐపీఎల్ సీజన్స్ లో...చైన్నై 15 సీజన్లు ఆడింది.అయితే వాటిలో 10సార్లు ఫైనలిస్టుగా..ఐదుసార్లు విజేతగా నిలిచిన ఘన చరిత్ర చెన్నైకి వరుసగా ఐదు మ్యాచులు ఓడిపోవటం ఇదే ఫస్ట్ టైమ్. అసలు ఎప్పుడూ లేనంతగా మ్యాచ్ లు ఓడిపోవటమే కాదు డాట్ బాల్స్ ఆడేస్తూ టీ20 కాస్త టెస్ట్ మ్యాచ్ గా మార్చేస్తోంది చెన్నై సూపర్ కింగ్స్. నిన్న కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 61 డాట్ బాల్స్ ఆడింది. అంటే 20 ఓవర్ల మ్యాచ్ లో పది ఓవర్లు ఊరికే తినేశారు. ఇదేంటీ చెన్నై ఇలా ఆడుతోంది. అనే డౌట్ మీకు కూడా ఉంటే రీజన్ ఏంటో నెటిజన్స్ చెప్తున్నారు.ఓ సారి ఈ వీడియో చూసేయండి. ఏంటీ అర్థమైందా. అడవులను పెంచే పనిలో ఉంది చెన్నై సూపర్ కింగ్స్. మీకు అందరికీ తెలుసు కదా ట్రీ ఫర్ డాట్ బౌల్ అనే క్యాంపెయిన్ నడుస్తూ ఉంటుంది ఐపీఎల్ లో ఏటా. అంటే బౌలర్ ఎవరైనా టీ20 హోరు జమానాలో ఓ డాట్ బాల్ కనుక బ్యాటర్ తో తినిపించినట్లైతే ఆ డాట్ కి బదులు గా ఓ మొక్కను ఆ బౌలర్ పేరు మీద నాటుతారు. దీన్ని సోషల్ రెస్పాన్సిబులిటీ స్పాన్సర్ కంపెనీలు తీసుకుంటాయి. 2013 నుంచి ప్లే ఆఫ్స్ లో టాటా గ్రూప్ మరో కొత్త ప్రతిపాదనను తీసుకువచ్చింది. డాట్ బాల్ కి ఓ ట్రీ సాప్లింగ్ కాస్తా
పడే ప్రతీ డాట్ బాల్ కి 500 మొక్కలు నాటే బాధ్యతను తీసుకుంటామని ప్రకటించి అప్పటి నుంచి అలాగే చేస్తోంది. సో దీన్ని దృష్టిలో చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో చాలా మొక్కలు నాటే సందేశంతో ధోని సారథ్యంలో డాట్ బాల్ మీద డాట్ బాల్స్ ఆడుతూ మొక్కల్ని పెంచే పనిలో ఉందని సెటైర్స్ వేస్తున్నారు మిగిలిన జట్ల అభిమానులు. ఇదుగో ఈ సీజన్ ముగిసే సరికి చెన్నై గ్రౌండ్ అంతా ఇలా దట్టమైన అడవి లా తయారవ్వకపోతే అడగండి అంటూ ఈ స్టేడియంలో చెట్ల ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు.





















