Coconut Water : కొబ్బరి కాయలో నీరు ఎంత ఉందో ఇలా సులభంగా తెలుసుకోండి !
Coconut Water : కొబ్బరి నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ, మార్కెట్లో తక్కువ నీటితో ఉన్న కొబ్బరి నీళ్ళు ఎక్కువగా అమ్ముతున్నారు. హైదరాాద్‌లాంటి ప్రాంతాల్లో ఒక నీళ్ల కాయ కొనాలంటే 60 రూపాయలు పెట్టాలి.

How to check coconut water: వేసవి కాలంలో వేగంగా ఉపశమనం ఇచ్చే పానీయంఏదైనా ఉందంటే మాత్రం అది కొబ్బరి మాత్రమే. అందుకే వేసవిలో ఎక్కువ మంది కొబ్బరి నీళ్లు తాగడానికి ఇష్టపడతారు. కానీ ఇదే మంచి వ్యాపార సమయం అని గ్రహించిన వ్యాపారులు రేటు పెంచి అమ్ముతుంటారు. అంతేకాకుండా క్వాలిటీ లేని కొబ్బరిని కూడా అమ్ముతుంటారు. మరి కొబ్బరి మంచిదా కాదా, నీళ్లు ఎక్కువ ఉండే కాయలను ఎలా ఎంచుకోవాలో ఒక్కసారి చూద్దాం.
కొబ్బరి శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా, పోషణ, శక్తిని కూడా ఇస్తుంది. కొబ్బరి నీటిలో సహజ ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాల్షియం లాంటి ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి వరంలాంటివి.
ఇవన్నీ శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. కానీ మార్కెట్ నుంచి తాజా కొబ్బరిని కొనుగోలు చేసినప్పుడు చాలా అనుమానాలు వస్తాయి. అందులో నీరు ఎంత ఉంది. అది తీయగా ఉంటుందా లేదా అనే చాలా మందికి అనిపిస్తుంది. ఈ విషయంలో చాలా గందరగోళం పడుతుంటారు.
అసలు కొబ్బరిలో నీళ్లు గురించి తెలుసుకోవడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. కొబ్బరి కట్ చేయకుండానే అందులో ఎంత నీరు ఉందో, అది తీయగా ఉంటుందో లేదో ఓ అంచనాకకు రావచ్చు. దీనికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి.
కొబ్బరిలో ఎంత నీరు ఉందో తెలుసుకోవడం ఎలా?
ఒక కొబ్బరిలో సగటున 200 నుంచి 400 మిల్లీలీటర్ల వరకు నీరు ఉంటుంది. ఈ నీటి పరిమాణం కొబ్బరి కాయ ఏజ్, రకం, దాని లోపల ఉన్న గుజ్జు మందం మీద ఆధారపడి ఉంటుంది. దీని ఆధారంగా కొబ్బరిలో ఎంత నీరు ఉంటుందో అంచనా వేయవచ్చు.
కొబ్బరిలో నీటిని గుర్తించే మార్గాలు
1. షేక్ చేసి శబ్దం వినండి
కొబ్బరిని మీ చెవికి దగ్గరగా ఉంచి షేక్ చేయండి. లోపల నుంచి గలగల శబ్దం బిగ్గరగా, స్పష్టంగా వినిపిస్తే, నీరు పుష్కలంగా ఉందని అర్థం. శబ్దం చాలా తక్కువగా లేదా మందంగా ఉంటే, నీరు తక్కువగా ఉండవచ్చు లేదా ఎండిపోయి ఉండవచ్చు.
2. బరువు గమనించండి
మంచి తాజా కొబ్బరి పట్టుకుంటే బరువుగా అనిపిస్తుంది. అది తేలికగా అనిపిస్తే, నీరు తక్కువగా ఉండవచ్చు. అలాంటి కొబ్బరిని కొనడం మానుకోండి,
3. కొబ్బరి తొక్క తీసిన తర్వాత నొక్కి చూడండి
కొన్నిసార్లు కొబ్బరిపై తొక్క మెత్తగా ఉంటుంది. దాని పై తొక్కను ప్రెస్ చేస్తే అది తాజాదా కాదా అని తెలిసిపోతుంది.
4. పై భాగాన్ని జాగ్రత్తగా చూడండి
కొబ్బరి 'ఐ స్పాట్' ను గమనించండి. మూడు ఏరియాగా డివైడ్ చేసి ఉంటుంది. వాటిని చూస్తే కట్ చేసినట్టు ఉంటే దానిలో నీరు ఉంటుంది. పాత కొబ్బరిపై ఎండిపోయినట్టు కనిపిస్తుంది. నల్లని మచ్చలు ఉంటే కూడా అది తాజాది కాదని అర్థం.
5. రెండు లేదా మూడు కాయలను పోల్చి చూడండి
మీరు వ్యాపారలు వద్ద కొబ్బరి కొనేటప్పుడు ఒకట్రెండు కాయలను పరిశీలించండి. వాళ్లు ఇచ్చిన కాయలను మాత్రమే తీసుకోకుండా మరిన్ని కాయలను షేక్ చేసి, పోల్చి చూసుకోండి. ఎక్కువ బరువుగా, శబ్దం చేసేదాన్ని ఎంచుకోండి. అలా చేయడం ద్వారా మీరు కొబ్బరిలో నీటిని అంచనా వేయవచ్చు.
6. రంగు గమనించండి
చాలా కొబ్బరి కాయలు చూడటానికి సాధారణంగా ఒకేలా ఉంటాయి. కానీ జాగ్రత్తగా గమనిస్తే మాత్రం తేడా తెలుస్తుంది. మంచి తాజా కొబ్బరి కాయ చాలా గ్రీన్‌గా ఉంటుంది. లేకుంటే ఎండిపోయినట్టు ఉండొచ్చు. తొక్క కలర్ మారిపోయిం ఉంటుంది.
గమనిక: వార్తలో ఇచ్చిన కొంత సమాచారం మీడియా నివేదికల ఆధారంగా ఉంది. ఏదైనా సూచనను అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణులను సంప్రదించండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

