RBI Repo Rate: కారు, ఇంటి ఈఎంఐలపై అమెరికా, చైనా ఈగో ఎఫెక్ట్, ఇంతకీ తగ్గుతాయా? పెరుగుతాయా?
RBI Repo Rate:2025లో ఆర్బీఐ రెండుసార్లు రెపో రేటు బేసిన్ పాయింట్లు తగ్గించింది. 6.50గా ఉన్న రెపో రేటు ప్రస్తుతం ఆరు శాతానికి వచ్చింది. ఇది మరింత తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.

RBI Repo Rate: ఇళ్ళు, కార్ల రుణాలు తీసుకునే వారికి ఈ సంవత్సరం EMIలో మరింత ఉపశమనం లభించే అవకాశం ఉంది. దీనికి కారణం అమెరికా పెంచిన టారిఫ్‌ల వల్ల ఏర్పడిన ప్రపంచవ్యాప్త అనిశ్చితి. అలాంటి పరిస్థితుల్లో RBI తరపున రెపో రేటును మరింత తగ్గించే అవకాశం ఉంది. దేశీయంగా ఆర్థిక వృద్ధి రేటు వేగం తగ్గడం, ధరల పెరుగుదల కారణంగా రెపో రేటు తగ్గించే వీలుంది. దీనికి RBI తరపున మరింత చర్యలు తీసుకోవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరం అవ్వడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. దీని వల్ల ఆర్థిక పెరుగుదలలో మందగమనం ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో సెంట్రల్ బ్యాంక్ తన విధానంలో దూకుడు పెంచబోతందని అంటున్నారు. ఈ కారణంగానే కొన్ని సడలింపులు వస్తాయని చెబుతున్నారు.
తాజాగా ఒక నోట్‌లో Nomura ఆర్థిక నిపుణులు సోనల్ వర్మ, అరోదిప్ నంది... "వృద్ధిని కొనసాగించడానికి పెరుగుతున్న చమురు ధరలు, ఇతర వస్తువుల ధరల పెరుగుదల అదుపు చేయడనికి విధాన మార్పు అవసరం కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో రెపో రేటు 5.00% నుంచి 5.50% వరకు మార్చవచ్చు " అని పేర్కొన్నారు.
RBI ఈ నెలలోనే రెపో రేటులో మార్పు చేసింది. తగ్గించింది. రెపోలో 25 బేసిస్ పాయింట్ల తగ్గింపు తర్వాత దీన్ని 6 శాతంగా చేసింది. అయితే, RBI జీపీడీ, ధరల పెరుగుదల రెండింటిలోనూ తగ్గుదలను అంచనా వేసింది. జీపీడీ 6.5 శాతం, ధరల పెరుగుదల 4 శాతం ఉంటుందని అంచనా వేసింది.
ఇది మరింత తగ్గుతుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. Nomura మాత్రం మరిన్ని ఉపశమనాలు ఉంటాయని చెబుతోంది. జూన్, ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్ నెలల్లో జరిగే పాలసీ సమావేశాల టైంలో ఉపశమనం కోసం చర్యలు తీసుకుంటారని అంటున్నారు. RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆర్థిక వృద్ధి రేటుపై వాణిజ్య ఒత్తిళ్లు తగ్గించడం చాలా కష్టమని అంగీకరించారు. అందుకే ఉపశమనం అంచనాల కంటే ఎక్కువగా ఉండవచ్చని చాలా మంది ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
చాలా మంది ఆర్థిక నిపుణులు ఈ సంవత్సరం 50 బేసిస్ పాయింట్ల రెపో రేటులో మరింత తగ్గింపు ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. అంటే వినియోగదారులకు గుడ్ న్యూస్ ఉంటుందన్నమాట. తక్కువ వడ్డీ రేటు, చౌకైన రుణాలు, నెలవారీ EMIలో కొంత తగ్గింపు లభించనుందని అంచనా వేస్తున్నారు.
రెండు రోజుల క్రితం అంటే ఏప్రిప్ 9న దేశంలోని రుణగ్రహీతలకు RBI ఊరట కల్పించింది. బ్యాంక్ వడ్డీ రేట్లను ప్రభావితం చేసే రెపో రేటును 0.25 శాతం లేదా 25 బేసిస్ పాయింట్లు (25 bps) తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి అనుగుణంగా రెపో రేటు పావు శాతం తగ్గింది. ప్రస్తుతం ఉన్న 6.25 శాతం నుంచి 6.00 శాతానికి దిగి వచ్చింది. ఇదే మరింత తగ్గుతుందని అంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మొదటిసారి రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అప్పుడు రేట్లు 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తీసుకొచ్చింది. ఇప్పుడు దాన్ని ఆరు శాతనికి తెచ్చింది.





















