MI vs RCB Match Highlights IPL 2025 | ముంబైపై 12పరుగుల తేడాతో గెలిచిన ఆర్సీబీ | ABP Desam
ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు లాంటి బలమైన టీమ్స్ తలపడితే మ్యాచ్ లో ఎంత మజా ఉండాలో ఈ రోజు మ్యాచ్ లో అంత మజా ఉంది. ఎక్కడా ఎవ్వరూ తగ్గలేదు. ఆధిపత్యాన్ని చెరో సగం మార్చుకుంటూ ఆఖరి ఓవర్ వరకూ ఆసక్తికరంగా జరిగిన MI vs RCB మ్యాచ్ లో విజయం నే వరించింది. మరి ఈ మ్యాచ్ లో టాప్ ఫైవ్ హైలెట్స్ ఈ వీడియో లో చూద్దాం.
1. కింగ్ విరాట్ విధ్వంసం
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై తమ నిర్ణయం సరైనదేనని ఫిల్ సాల్ట్ వికెట్ తీయగానే భావించింది. బౌల్ట్ బౌలింగ్ లో మొదటి ఓవర్ లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు ఫిల్ సాల్ట్. అయితే వన్ డౌన్ లో వచ్చిన పడిక్కల్ తో కలిసి ఆర్సీబీని పరుగులు పెట్టించాడు కింగ్ కొహ్లీ. గాయం నుంచి కమ్ బ్యాక్ ఇచ్చిన బుమ్రాను కూడా సిక్స్ బాదుతూ పవర్ చూపించాడు విరాట్. పడిక్కల్ 22 బాల్స్ లో 33 పరుగులు చేసి అవుటైతే..కెప్టెన్ రజత్ పటీదార్ తో కలిసి ఆ జోరును మరింత పెంచాడు కొహ్లీ. మొత్తంగా 42 బాల్స్ లో 8 ఫోర్లు 2 సిక్సర్లతో 67 పరుగులు చేసి పాండ్యా బౌలింగ్ లో అవుటైపోయాడు కొహ్లీ.
2. కెప్టెన్ పటీదార్ షో
కింగ్ కొహ్లీ ఇచ్చిన దూకుడును నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళ్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు కెప్టెన్ రజత్ పటీదార్. 32 బంతులు ఆడి 5ఫోర్లు 4 భారీ సిక్సర్లతో 64పరుగులు చేశాడు. టీమ్ స్కోర్ ను రెండొందలు దాటించిన తర్వాత బౌల్ట్ బౌలింగ్ లో అవుటైపోయినా కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆర్సీబీ ని నిలబెట్టాడు పటీదార్.
3. జితేశ్ సూపర్ క్యామియో
ఇద్దరు బ్యాటర్లు 60 ప్లస్ స్కోర్లు కొడితేనే ఆర్సీబీ స్కోరు 200 దాటేసిందా అంటే కాదు చివర్లో వికెట్ కీపర్ జితేశ్ శర్మ క్యామియో సూపర్ అంటే సూపర్ అసలు. 19 బంతుల్లోనే 2 ఫోర్లు 4 సిక్సర్లతో 40 పరుగులు చేసిన జితేశ్..ఆర్సీబీ స్కోరు 221 కి తీసుకెళ్లి ముంబై ఇండియన్స్ కి 222 టార్గెట్ ఇచ్చేలా చేశాడు. ఆర్సీబీ బ్యాటర్ల ధాటికి బుమ్రా తప్ప మరే బౌలరు కూడా పది కంటే తక్కువ ఎకానమీ నమోదు చేయలేకపోయారు.
4. తిలక్ వర్మ పోరాటం
ఏ బ్యాటర్ నైతే లాస్ట్ మ్యాచ్ లో స్లోగా ఆడాడు అని బలవంతంగా రిటైర్డ్ అవుట్ చేయించారో అదే బ్యాటరో ఆర్సీబీ పెట్టిన భారీ స్కోరును ఛేజ్ చేసేంత దూకుడుగా ముంబై స్కోరు బోర్డును తీసుకువెళ్లాడు. రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టెన్, విల్ జాక్స్, సూర్య కుమార్ యాదవ్ అందరూ దారుణంగా ఫెయిల్ అవ్వకపోయినా ఎవ్వరూ 30పరుగుల స్కోరు కూడా చేయలేదు. కానీ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తో కలిసి దుమ్ము రేపాడు తిలక్ వర్మ. 29 బాల్స్ మాత్రమే 4 ఫోర్లు 4 సిక్సర్లతో 56 పరుగులు చేసి భువీ బౌలింగ్ లో అవుటైపోయాడు .
5. పాండ్యా వర్సెస్ పాండ్యా
ముంబైలో తోపు బ్యాటర్లంతా అయిపోయారు తిలక్ వర్మకు తోడు గా ఉండే వాడే లేడే అనుకుంటున్న టైమ్ లో వచ్చాడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా. తను తిలక్ కు తోడుండటం కాదు ఒక్క ఆర్సీబీ బౌలర్ కి కూడా నిలువ నీడ లేకుండా చేశాడు. మొదటి బంతి నుంచే బౌండరీలు బాదుతూనే ఉన్నాడు పాండ్యా. ప్రధానంగా కృనాల్ పాండ్యా బలైపోయాడు. అన్నయ్యని అఅని కూడా చూడకుండా అడ్డదిడ్డంగా కొట్టాడు కృనాల్ ని హార్దిక్ పాండ్యా. కేవలం 15 బంతులు మాత్రమే ఆడి 3 ఫోర్లు, 4 సిక్సర్లతో మెరువేగంతో 42 పరుగులు చేసి అవుటైపోయాడు హార్దిక్. ఇక మ్యాచ్ గెలవాలంటే చివరి ఓవర్ లో 19 పరుగులు కావాల్సిన టైమ్ లో చివరి ఓవర్ కృనాల్ పాండ్యా వేయగా..వరుస బంతుల్లో వికెట్లు..అద్భుతమైన ఫీల్డింగ్ తో అద్భుతాలు చేసింది ఆర్సీబీ. లాస్ట్ ఓవర్ లో మూడు వికెట్లు తీసి మ్యాచ్ ను గెలిపించి తమ్ముడు హార్దిక్ కి జోల్ట్ ఇచ్చాడు అన్నయ్య కృనాల్.
ఈ విజయంతో సీజన్ లో ఆర్సీబీ మూడో విక్టరీని నమోదు చేయగా...ముంబై ఇండియన్స్ సీజన్ లో నాలుగో ఓటమిని చవిచూసింది.





















