War 2 Movie: 'ఎన్టీఆర్‌కు ఎప్పుడూ రుణపడి ఉంటాను' - 'వార్ 2' మూవీపై హృతిక్ రోషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్, ఈ భాషల్లోనే రిలీజ్ అవుతుందా?
Hrithik Roshan: 'వార్ 2' మూవీపై బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్‌కు చాలా రుణపడి ఉంటానని.. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కంటే చాలా భారీగా ఉంటుందని అన్నారు.

Hrithik Roshan About NTR In War 2 Movie: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan), ఎన్టీఆర్ (NTR) కీలక పాత్రల్లో నటించిన అవెయిటెడ్ మూవీ 'వార్ 2' (War 2 Movie). ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకోగా మూవీ టీం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా.. ఓ ఈవెంట్‌లో పాల్గొన్న హృతిక్.. 'వార్ 2'తో పాటు ఎన్టీఆర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
'ఆయనకు రుణపడి ఉంటా'
ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌తో పని చేయడం వల్ల ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుసుకున్నానని హృతిక్ తెలిపారు. 'వార్ 2 చాలా సులభంగా అయిపోయింది. షూటింగ్‌లో ప్రతీ షెడ్యూల్ పర్‌ఫెక్ట్‌గా ప్లాన్ చేశారు. నిర్మాత ఆదిత్య చోప్రా, దర్శకుడు అయాన్ ముఖర్జీ వల్లే ఇదంతా సాధ్యమైంది. ఎన్టీఆర్‌కు ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఆయన మంచి టీమ్ మేట్. 'వార్ 1'తో పోలిస్తే సెకండ్ పార్ట్ భారీగా ఉంటుంది. ఈ మూవీ చేసినందుకు చాలా గర్వంగా ఉంది. సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని హృతిక్ తెలిపారు.
Also Read: ఆయుధంలా పెంచి యుద్ధం చెయ్యొద్దంటే ఎలా? - 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ట్రైలర్ అదుర్స్
'వార్ 2' మూవీతోనే ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ
'వార్ 2' సినిమాతోనే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన 'రా' ఏజెంట్‌గా కనిపించనున్నారని బాలీవుడ్ మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన స్పై థ్రిల్లర్ మూవీ 'వార్'. దీనికి సీక్వెల్‌గా 'వార్ 2' (War 2) చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీ ఎన్టీఆర్ నటిస్తుండగా.. ఒకరు బాలీవుడ్ స్టార్, మరొకరు టాలీవుడ్ టాప్ హీరో కావడంతో భారీగా హైప్ నెలకొంది. ఏజెంట్ పాత్రలన్నింటి కంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్ డిఫరెంట్‌గా ఉండనున్నట్లు సమాచారం.
గతంలో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, షారుక్ ఖాన్‌లు ఏజెంట్ పాత్రలో నటించి మంచి సక్సెస్ అందుకోగా.. వీటన్నిటికంటే ఎన్టీఆర్ రోల్ 'వార్ 2'లో డిఫరెంట్‌గా ఉండబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఎన్టీఆర్ బాలీవుడ్‌లో ఫస్ట్ హిట్ కొట్టాలని ఆయన ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు ఆకాంక్షిస్తున్నారు.
500 మంది డ్యాన్సర్లతో స్పెషల్ సాంగ్
ఈ సినిమాలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌లపై ఓ స్పెషల్ సాంగ్ కూడా మేకర్స్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు హీరోలతో పాటు దాదాపు 500 మంది డ్యాన్సర్లు సాంగ్‌లో భాగమయ్యారని తెలుస్తోంది. బాస్కో మార్టిస్ ఈ పాటకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించినట్లు తెలుస్తోంది. సినిమాకే హైలెట్‌గా నిలిచేలా ప్రీతమ్ ఈ పాటను చాలా గొప్పగా స్వరపరిచారని.. దాదాపు 6 రోజుల పాటు షూటింగ్ చేసినట్లు సమాచారం.
ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
3 భాషల్లోనే రిలీజ్?
'వార్ 2' సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో మేకర్స్ రిలీజ్ చేయనుండగా.. మొత్తం 5 భాషల్లో కాకుండా 3 భాషల్లోనే సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు, హిందీ సహా తమిళం భాషల్లోనే ఈ సినిమాను లాక్ చేశారని సమాచారం. మరి కన్నడ, మలయాళ భాషల్లో సినిమా రిలీజ్ అవుతుందో లేదో? తెలియాల్సి ఉంది.





















