అన్వేషించండి

UPI Down: ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే డౌన్.. నిలిచిపోయిన యూపీఐ సేవలు, యూజర్లు గగ్గోలు

Google Pay Down | డిజిటల్ పేమెంట్స్ నిలిచిపోవడంతో యూపీఐ యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. అటు బిల్లులు చెల్లింపులు కావడం లేదు, ఇటు జేబులో మనీ లేవని కామెంట్ చేస్తున్నారు.

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)లో శనివారం  టెక్నికల్ ప్రాబ్లం రావడంతో డిజిటల్ పేమెంట్స్ నిలిచిపోయాయి. భారతదేశంలో చాలా మంది వినియోగదారులు డిజిటల్ చెల్లింపులకు వీలుకావడం లేదని రిపోర్ట్ చేస్తున్నారు. Paytm,  ఫోన్ పే (PhonePe), గూగుల్ పే (Google Pay) డిజిటల్ పేమెంట్ యాప్‌లు పనిచేయడం లేదని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో యూపీఐ చెల్లింపులలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.

యూపీఐ చెల్లింపులకు తికమక..

మధ్యాహ్నం 12 గంటల సమయానికి సమస్య మరింత పెరిగింది. ఆ సమయంలో ఏకంగా 1200 మంది యూపీఐ చెల్లింపులపై రిపోర్ట్ చేశారు. 66 శాతం యూజర్లకు పేమెంట్ చేసే సమయంలో సమస్య తలెత్తినట్లు పేర్కొన్నారు. మరో 34 శాతం మంది యూజర్లకు ఫండ్ ట్రాన్స్‌ఫర్ కావడం లేదని రిపోర్ట్ చేశారు. ఇటీవల మార్చి నెలాఖరులలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఉన్న యూపీఐ వినియోగదారుల టెక్నికల్ ప్రాబ్లమ్ తో పేమెంట్స్ చేయలేకపోయారని తెలిసిందే.

షాపింగ్ మాల్స్, బిల్ పేమెంట్స్, మనీ ట్రాన్స్‌ఫర్ ఇలా ఏదైనా సరే.. టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా యూపీఐ పేమెంట్స్ నిలిచిపోయాయి. దాంతో సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా పోస్టులు పెడుతున్నారు. వీకెండ్ కదా అని షాపింగ్ కు వెళ్లి పేమెంట్స్ అవ్వక, ఇటు జేబులో నగదు లేక ఇబ్బందులు పడుతున్నట్లు యూపీఐ యూజర్లు రిపోర్ట్ చేస్తున్నారు.

UPI అంటే ఏమిటి..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పర్యవేక్షణలో పనిచేసే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) రూపొందించిన తక్షణ చెల్లింపు వ్యవస్థను యూపీఐగా చెప్పవచ్చు. దీని ద్వారా ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే లాంటి డిజిటల్ పేమెంట్ యాప్‌ల ద్వారా ఎలాంటి ఛార్జీలు లేకుండా మొబైల్ నెంబర్‌కు, బ్యాంకు ఖాతాలకు క్షణాల్లో నగదు బదిలీ చేయవచ్చు. షాపింగ్ మాల్స్, చిన్న షాపులలో, ఎలాంటి కొనుగోళ్లు చేయాలన్నా యూపీఐ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. 

అయితే యూపీఐ ఎందుకు డౌన్ అయిందనే దానిపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. NPCI నుంచి, యూపీఐ ప్లాట్‌ఫాంల నుంచి అధికారిక ప్రకటన కూడా రాలేదు. దాంతో నగదు చెల్లింపుల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనీ ట్రాన్స్‌ఫర్ బదులు నగదు ప్రత్యామ్నాయ చెల్లింపులకు నగదు  అందుబాటులో ఉంచుకోవాలని వినియోగదారులకు సూచించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: వచ్చే ఏడాదికి గిరిజన ప్రాంత స్కూల్స్ అన్నింటికీ సొంత భవనాలు: మంత్రి నారా లోకేష్
వచ్చే ఏడాదికి గిరిజన ప్రాంత స్కూల్స్ అన్నింటికీ సొంత భవనాలు: మంత్రి నారా లోకేష్
Paper Leak New Bill: పేపర్ లీక్‌ బిల్లు.. బాధ్యులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 1 కోటి రూపాయల జరిమానా !
పేపర్ లీక్‌ బిల్లు.. బాధ్యులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 1 కోటి రూపాయల జరిమానా !
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
PM Modi On Paper Leak: పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget