Ka Movie OTT Streaming: మరో ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం సూపర్ హిట్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Ka Movie OTT Platform: టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం బిగ్గెస్ట్ హిట్ మూవీ 'క'. ఇప్పటికే ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా తాజాగా 'అమెజాన్ ప్రైమ్'లోనూ అందుబాటులోకి వచ్చింది.

Kiran Abbavaram's Ka Movie OTT Streaming On Amazon Prime Video: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'క' (Ka Movie). గతేడాది విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి.. కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
మరో ఓటీటీలోకి 'క' మూవీ
ఇప్పటివరకూ ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఈటీవీ విన్'లో (ETV Win) స్ట్రీమింగ్ అవుతున్న 'క' మూవీ ఇప్పుడు మరో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' (Amazon Prime Video) సడన్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సినిమా అందుబాటులోకి వచ్చింది. పీరియాడికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు అభిమానులు చాలా మంది ఉన్నారు. ఇంకా చూడని వారు ఎవరైనా ఉంటే ఈటీవీ విన్‌తో పాటు 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లోనూ ఈ సినిమాను చూసి ఎంజాయ్ చెయ్యండి.
Also Read: యూట్యూబ్‌లో ఫ్రీగా 'టచ్ మీ నాట్' వెబ్ సిరీస్ - టీం సడన్ సర్‌ప్రైజ్, అయితే చిన్న ట్విస్ట్!
ఈ సినిమాకు సుజీత్ - సందీప్ దర్శకత్వం వహించగా.. చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మించారు. కిరణ్ అబ్బవరం సరసన.. నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీ నుంచి ఓటీటీలోకి వచ్చిన ఫస్ట్ తెలుగు సినిమాగా 'క' రికార్డు క్రియేట్ చేసింది.
స్టోరీ ఏంటంటే?
1977లో ఓ గ్రామంలో సాగే స్టోరీ ఇది. అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) ఓ అనాథ. చిన్నప్పటి నుంచి కూడా పక్కవాళ్ల ఉత్తరాలు చదువుతాడు. పోస్ట్ మ్యాన్ అయితే అందరి ఉత్తరాలు చదవొచ్చు అని భావిస్తాడు. ఆ ఆశతోనే పోస్ట్ మ్యాన్ జాబ్‌లో చేరుతాడు. తన పెంపుడు కుక్కతో కలిసి కృష్ణగిరి అనే గ్రామానికి వెళ్తాడు. అక్కడ హెడ్ పోస్ట్ మాస్టర్ రామారావు (అచ్యుత్ కుమార్) అనుమతితో అసిస్టెంట్‌గా జాయిన్ అవుతాడు. అదే గ్రామంలో ఉంటూ రామారావు కూతురుతో (నయన్ సారిక) ప్రేమలో పడతాడు.
అయితే, సరిగ్గా అదే సమయంలో గ్రామంలో అమ్మాయిలు ఒక్కొక్కరుగా మిస్ అవుతుంటారు. అసలు అమ్మాయిలను ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేస్తారు?, అసలు వాసుదేవ్‌కు తెలిసిన నిజం ఏంటి?, ఉత్తరాలు చదవడంతో అతను కిడ్నాప్స్ వ్యవహారాన్ని ముందే పసిగట్టగలిగాడా?, ఓ ముసుగు వ్యక్తి వాసుదేవ్ వెంట ఎందుకు పడ్డాడు? కిడ్నాప్ అయిన అమ్మాయిలను వాసుదేవ్ కాపాడాడా?, చీకటి గదిలో బంధించబడిన రాధకు (తన్వి రామ్) వాసుదేవ్‌కు ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఆద్యంతం పలు ట్విస్టులతో సినిమా ఆసక్తిగా సాగుతోంది. సైకలాజికల్ థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన డిఫరెంట్ కాన్సెప్ట్‌కు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు ఈ సినిమా తాజాగా ఓటీటీల్లోనూ ట్రెండింగ్‌గా నిలుస్తోంది.





















