Janhvi Kapoor: అందాల నటి జాన్వీ కపూర్‌కు ఖరీదైన కారు గిఫ్ట్ - ఎవరు పంపించారో తెలుసా?
Ananya Birla Gift: ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా కుమార్తె అనన్య.. అందాల నటి జాన్వీ కపూర్‌కు ఖరీదైన కారు బహుమతిగా పంపించారు. కారుతో పాటు మరో సర్ ప్రైజ్ కూడా ఇచ్చారు.

Janhvi Kapoor Gets Costliest Gift From Ananya Birla: అందాల నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఖరీదైన గిఫ్ట్ అందుకున్నారు. బిర్లా వారసురాలు అనన్య బిర్లా (Ananya Birla) ఆమెకు రూ.5 కోట్ల విలువైన లంబోర్గిని కారును పంపించి సడెన్ సర్ ప్రైజ్ చేశారు. శుక్రవారం ఉదయం పర్పుల్ కలర్ లంబోర్గిని కారును జాన్వీ నివాసానికి పంపించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
కారుతో పాటు మరో గిఫ్ట్
ఖరీదైన కారుతో పాటు మరో గిఫ్ట్ సైతం అందులో ఉంచారు. ఆ గిఫ్ట్ ప్యాక్‌పై 'ప్రేమతో నీ అనన్య' అని రాసి ఉంది. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా కుమార్తె అనన్య.. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ బోర్డు డైరెక్టర్లలో ఒకరిగా వ్యవహరిస్తున్నారు. 17 ఏళ్ల వయసులోనే స్వతంత్ర మైక్రోఫిన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో తన మొదటి సంస్థను స్థాపించారు. ఈ సంస్థ భారత్‌లోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో ఒకటి. ఈమె గాయనిగానూ రాణిస్తున్నారు. పలు ప్రైవేట్ ఆల్బమ్స్ కోసం అనన్య వర్క్ చేశారు.
View this post on Instagram
ఆ బ్రాండ్ కోసం వర్క్ చేస్తున్నందుకేనా..
అనన్య - జాన్వీ ఎంతోకాలంగా స్నేహితులు కాగా.. అనన్య ఇటీవల కాస్మోటిక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ప్రకటించారు. దీనికి జాన్వీ కపూర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. తన బ్రాండ్ కోసం వర్క్ చేస్తున్నందునే జాన్వీకి ఖరీదైన లంబోర్గిని కారును బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది.
Also Read: మాస్ అభిమానులకు నిజంగా 'మాస్ జాతరే' - సూపర్ హిట్ సాంగ్ రిపీట్, ప్రోమో అదిరిపోయిందిగా!
ఇక సినిమాల విషయానికొస్తే.. బాలీవుడ్‌లో ధడక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. తన ఫస్ట్ సినిమాతోనే మంచి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎంచుకుంటూ తనదైన నటన, అందంతో మెప్పించారు. బాలీవుడ్‌లో సక్సెస్ అందుకున్న ఆమె దక్షిణాదిలోనూ తనదైన మార్క్ చూపించారు. టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన 'దేవర' (Devara) సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమయ్యారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకుంది. దీనికి సీక్వెల్‌గా 'దేవర 2' సైతం రాబోతోంది.
అటు.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు (Buchibabu) కాంబోలో లేటెస్ట్ మూవీ 'పెద్ది'. ఈ సినిమాలోనూ జాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఆమె లుక్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ అదిరిపోయింది. గ్రామీణ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో క్రికెట్ ప్రధానాంశంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. చరణ్ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది.






















