Touch Me Not Web Series: యూట్యూబ్‌లో ఫ్రీగా 'టచ్ మీ నాట్' వెబ్ సిరీస్ - టీం సడన్ సర్‌ప్రైజ్, అయితే చిన్న ట్విస్ట్!
Touch Me Not Web Series Streaming: దసరా ఫేం దీక్షిత్ శెట్టి, టాలీవుడ్ నటుడు నవదీప్ నటించిన వెబ్ సిరీస్ 'టచ్ మీ నాట్'. ఈ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ యూట్యూబ్‌లో అందుబాటులోకి వచ్చింది.

Navdeep's Touch Me Not Web Series Streaming On Jio Hotstar: టాలీవుడ్ నటుడు నవదీప్, 'దసరా' ఫేం దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'టచ్ మీ నాట్' (Touch Me Not Web Series). ఈ నెల 4న ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్' (Jio Hotstar) వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సదరు ఓటీటీ సంస్థ ఆడియన్స్‌కు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది.
ఫ్రీగా ఫస్ట్ ఎపిసోడ్
ఈ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్‌ను యూట్యూబ్‌లో (Youtube) అందుబాటులోకి తెచ్చింది. ప్రేక్షకులు ఉచితంగా చూసే వెసులుబాటు కల్పించింది. మిగిలిన 5 ఎపిసోడ్స్‌ను మాత్రం యాప్‌లోనే చూడాలని పేర్కొంది. కొరియన్ సిరీస్ 'హీ ఈజ్ సైకోమెట్రిక్' ఆధారంగా దర్శకుడు రమణతేజ రూపొందించారు. ఈ సిరీస్‌లో కోమలీ ప్రసాద్, దేవీ ప్రసాద్, హర్ష వర్ధన్ తదితరులు నటించారు.
The first episode of Touch Me Not is now streaming on YouTube.
— JioHotstar Telugu (@JioHotstarTel_) April 12, 2025
🔗 - https://t.co/Id6BI1TNrw
Who’s hiding what? And why does every touch feel like a trap? Unravel the mystery. Feel the tension 🤯
Catch all episodes on JioHotstar! Touch carefully… or don’t touch at all!… pic.twitter.com/CHeRSn6hq5
Also Read: మాస్ అభిమానులకు నిజంగా 'మాస్ జాతరే' - సూపర్ హిట్ సాంగ్ రిపీట్, ప్రోమో అదిరిపోయిందిగా!
స్టోరీ ఏంటంటే?
హీరో ఎవరినైనా, ఏ వస్తువునైనా తాకితే గతంలో ఏం జరిగిందో చెప్పడమే ప్రధానాంశంగా ఈ సిరీస్ తెరకెక్కుతోంది. రిషి (దీక్షిత్ శెట్టి) చిన్నప్పుడు భవనం పైనుంచి కింద పడడంతో 'సైకోమెట్రిక్' అనే సమస్య బారిన పడతాడు. అయితే, అది ఆయనకు సమస్యలా కాకుండా ఓ వరంలా మారుతుంది. అతడిని ఎవరైనా తాకినా లేదా తాను ఎవరినైనా, ఏ వస్తువునైనా తాకినా వాటి తాలూకా గతం చెప్పగలడు. ఇలాంటి క్రైమ్ సీన్‌లో వస్తువులను తాకితే హంతకుల గురించి సరైన క్లూ ఇస్తాడని భావిస్తారు పోలీసులు.
ఈ క్రమంలోనే 'గోదావరి హాస్పిటల్'కు సంబంధించిన ఫైర్ యాక్సిడెంట్ కేసును ఛేదించేందుకు రిషి హెల్ప్ తీసుకోవాలని అనుకుంటారు పోలీసులు. ఎస్పీ రాఘవ్ (నవదీప్)కి, రిషికి ముందు నుంచీ ఉన్న పరిచయంతో అతన్ని సంప్రదిస్తాడు. ఆస్పత్రిలో జరిగినట్లే కొన్నాళ్ల క్రితం ఓ అపార్ట్‌మెంట్‌లోనూ అలాంటి ప్రమాదమే జరగడంతో దాన్ని కూడా రీ ఇన్విస్టిగేషన్ చేయాలని అనుకుంటారు. కొత్త కేసు కోసం పాత కేసును రీ ఇన్వెస్టిగేషన్ చేయాలని ప్రయత్నిస్తారు. మరి, అవి నిజంగా ప్రమాదాలేనా?, దీని వెనుక ఎవరున్నారు?, రిషి పోలీసులకు ఎలా హెల్ప్ అయ్యాడు?, పోలీసులు ఈ కేసును సాల్వ్ చేశారా అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
మరోవైపు, 'జియో హాట్ స్టార్' సబ్ స్కైబర్ల సంఖ్య 200 మిలియన్లకు చేరినట్లు సంస్థ వైస్ ఛైర్మన్ తెలిపారు. అతి తక్కువ కాలంలోనే ఇంతమంది సబ్ స్కైబర్లు రావడం ఆనందంగా ఉందన్నారు.





















