Racharikam Trailer: చూస్తా ఉండూ... సీఎం, పీఎం అవ్వాలంటే జైలుకి వెళ్లడం ఒక క్వాలిఫికేషన్ అవుతాది - ‘రాచరికం’ ట్రైలర్ బీభత్సమే!
Apsara Rani Racharikam Movie: భూం బద్దలు భామ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రాచరికం’. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను దర్శకుడు మారుతి చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే..
‘భూం బద్దలు భూం బద్దలు’ అంటూ కుర్రకారు గుండెల్ని దోచేసిన అప్సరా రాణి.. ఇప్పుడు తనలోని రెండో యాంగిల్‌ని పరిచయం చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు తనని గ్లామర్ గాళ్‌గానే చూసిన వారందరికీ తనలోనూ ఒక నటి ఉందని ‘రాచరికం’ ద్వారా చెప్పబోతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, స్టిల్స్, పాటలు, టీజర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేయగా.. బుధవారం దర్శకుడు మారుతి చేతుల మీదుగా చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే..
ఒక భారీ డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ‘రాచకొండ ఒక అడవి లాంటిదబ్బా.. ఈడ బలంతో పోరాడే పులులు, బలగంతో పోరాడే ఏనుగులు, ఎత్తుకు పై ఎత్తు వేసే గుంట నక్కలు, కాసుకుని కాటేసే విష సర్పాలు ఉంటాయి.. వాటి మధ్య జరిగే పోరులో రక్త పాతాలే తప్పా రక్త సంబంధాలు ఉండవు’ అంటూ ఓ పవర్ ఫుల్ వాయిస్‌లో డైలాగ్ వినిపిస్తుంటే.. ఆ వాయిస్ వచ్చే సమయంలో కనిపించే సీన్లు భయంకరంగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే టైటిల్‌కు జస్టిఫికేషన్ ఇచ్చేలా ఉన్నాయి. ఈ ట్రైలర్‌లో అందరి చూపు ఇద్దరిపైనే ఉంది. ఆ ఇద్దరూ ఎవరో కాదు.. అప్సరా రాణి, వరుణ్ సందేశ్.
Also Read: పాన్ ఇండియా స్పై థ్రిల్లర్‌తో టాలీవుడ్‌లోకి వామిక రీ ఎంట్రీ - హ్యాండ్సమ్ హీరోతో యాక్షన్ ఫిల్మ్‌లో
అప్సరా రాణి రెండు వైవిధ్యమైన పాత్రలలో ఇందులో నటించినట్లుగా క్లారిటీ ఇచ్చారు. ఒకటి కుర్రకారును గిలిగింతలు పెట్టే రోల్ అయితే.. మరొకటి ఇందిరా గాంధీని తలపించే పొలిటికల్ నాయకురాలి పాత్ర. ఈ రెండు పాత్రలలోనూ ఆమె సరికొత్తగా కనిపించింది. అలాగే వరుణ్ సందేశ్ ఓ పవర్ ఫుల్ విలన్‌గా ఇందులో నటించినట్లుగా తెలుస్తోంది. ఆయన పాత్ర, వేషదారణ, ఆహార్యం అన్నీ కూడా కొత్త వరుణ్ సందేశ్‌ని పరిచయం చేస్తున్నాయి. ఈ సినిమా విడుదల తర్వాత వరుణ్ సందేశ్‌కు ఈ తరహా పాత్రలు వరసగా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంతగా తన పాత్రని రక్తి కట్టించాడు. ఇంకా ఇతర పాత్రలలో నటించిన వారు కూడా పర్ఫెక్ట్ అన్నట్లుగా సరిపోయారు. మొత్తంగా అయితే ఒక వయోలెంట్ ఫిల్మ్‌గా ‘రాచరికం’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ట్రైలర్ కట్ మాత్రం మధ్యలో చిన్న ఝలక్ అన్నట్లుగా ఉన్నా.. సినిమాపై మాత్రం అంచనాలను పెంచేదిగానే ఉంది.
అప్సర రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్, హైపర్ ఆది, రంగస్థలం మహేష్, విజయ రామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి వారంతా నటించిన ఈ చిత్రాన్ని చిల్ బ్రోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈశ్వర్ నిర్మించారు. సురేశ్ లంకలపల్లి, ఈశ్వర్ వాసె ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు. ఈ సినిమా అయినా అప్సరా రాణికి బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి.