Wamiqa Gabbi: పాన్ ఇండియా స్పై థ్రిల్లర్‌తో టాలీవుడ్‌లోకి వామిక రీ ఎంట్రీ - హ్యాండ్సమ్ హీరోతో యాక్షన్ ఫిల్మ్‌లో
Wamiqa Gabbi Tollywood Re Entry: నయా నేషనల్ క్రష్ వామికా గబ్బి టాలీవుడ్ రియల్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. తెలుగు హీరోతో పాన్ ఇండియా సినిమా చేస్తోంది. ఆ హీరో ఆ సినిమా వివరాలు తెలుసా?
వామిక గబ్బి (Wamiqa Gabbi)... నయా నేషనల్ క్రష్. వరుణ్ ధావన్ 'బేబీ జాన్'లో ఆవిడ టీచర్ రోల్ చేశారు. ఆ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ అయినప్పటికీ... మూవీ విడుదలకు ముందు ప్రచార కార్యక్రమాల్లో వామిక అందం చూసి యువత ఫిదా అయింది. దాంతో సోషల్ మీడియాలో ఆవిడ ట్రెండ్ అయ్యింది. 'బేబీ జాన్' విడుదల తర్వాత క్లైమాక్స్ ట్విస్ట్ చూసి జనాలు షాక్ అయ్యారు. వామిక ఏజెంట్ రోల్ చేశారని చూపించారు. ఇప్పుడు ఆవిడ మరోసారి మరొక సినిమాలో ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. పాన్ ఇండియా సినిమాతో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు.
అడివి శేష్ 'జీ 2'లో ఏజెంట్ 116గా...
Wamiqa Gabbi in Adivi Sesh G2: హ్యాండ్సమ్ హంక్ అడివి శేష్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'జీ 2'. ఆయన సూపర్ హిట్ 'గూడచారి'కు సీక్వెల్ ఇది. ఈ సినిమాకు వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఏజెంట్ 116 పాత్రలో వామిక గబ్బి నటిస్తున్నట్టు అనౌన్స్ చేశారు. హీరో హీరోయిన్లు కలిసి నిలబడిన లుక్ విడుదల చేశారు. అడివి శేష్ జోడీగా వామికా కనిపిస్తారని, ఆవిడ క్యారెక్టర్ కూడా ఏజెంట్ కావడంతో కథకు కొత్త కళ వస్తుందని చిత్ర బృందం పేర్కొంది.
My partner in c̶r̶i̶m̶e̶ adventure 💥💥
— Adivi Sesh (@AdiviSesh) January 7, 2025
Welcome to the mission, #WamiqaGabbi
It's gonna be amazing to run with you in Europe!
THUNDER GLIMPSE loading this Month🔥#G2 #Goodachari2 pic.twitter.com/Hn01fiUB9v
నవ దళపతి సుధీర్ బాబుకు జంటగా 'భలే మంచి రోజు'లో వామిక గబ్బి హీరోయిన్. ఆ సినిమా వచ్చి పదేళ్లు అవుతోంది. ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమా చేయలేదు. ఇప్పుడు 'జీ 2'తో మళ్ళీ తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నారు.
'జీ 2' సినిమాలో ఇమ్రాన్ హష్మీ సైతం!
ఇప్పుడు అడివి శేష్ సినిమాలు అంటే పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తి ఉంది. 'మేజర్' అతడికి జాతీయ స్థాయిలో గుర్తింపుతో పాటు గౌరవం తెచ్చిపెట్టింది. శేష్ నటనకు కూడా అభిమానులు ఏర్పడ్డారు. దాంతో భారీ స్థాయిలో 'జీ 2' సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ స్పై థ్రిల్లర్ ప్రేక్షకులకు థియేటర్లలో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చిత్ర బృందం చెబుతోంది. ఇందులో బాలీవుడ్ హీరో, సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర చేస్తున్నారు.
'జీ 2' సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థల మీద ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. షూటింగ్ అంతా కంప్లీట్ అయ్యాక విడుదల తేదీ అనౌన్స్ చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది. సినిమాను ఈ ఏడాది (2025)లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి అడివి శేష్ కృషి చేస్తన్నారు.