White Gold Price: బంగారం కన్నా ఎక్కువ, ప్లాటినం కన్నా తక్కువ.. తెల్ల బంగారం ధరలెలా ఉన్నాయంటే
White Gold : తెలుపు బంగారం ప్రత్యేక లక్షణాల విషయానికొస్తే ఇది మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది. మోడ్రన్ నగల ప్రియులకు సాంప్రదాయ బంగారానికి ప్రీమియం ప్రత్యామ్నాయంగా చేస్తాయి.
White Gold : బంగారం ధర రోజురోజుకు భారీగా పెరిగిపోతోంది. ఇప్పటికే సామాన్యుడు కొనలేని లెవల్ కి చేరుకుంది. భవిష్యత్ లో ఇది ఇలానే కొనసాగితే.. బంగారాన్ని ఫొటోల్లోనే, వీడియోల్లోనే చూడడం తప్ప ఏం చేయలేమని అంటున్నారు కొంతమంది. అయితే బంగారం గురించి అందరికీ తెలిసిందే. దాని కన్నా మన్నికైనది, ఖరీదైనది ప్లాటినం. కానీ దాని ధర రిత్యా అందరూ కొనలేరు. అలాంటి వారు వైట్ గోల్డ్ వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. అయితే ఇంతకీ తెల్ల బంగారం ఏంటీ.. వైట్ గోల్డ్ లక్షణాలు, ధరలు ఎలా ఉంటాయి అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వైట్ గోల్డ్ అంటే ఏమిటి?
సాంప్రదాయ ఎల్లో మెటల్ అంటే బంగారం కంటే తెల్ల బంగారం భిన్నంగా ఉంటుంది. 24-క్యారెట్ స్వచ్ఛమైన బంగారం పసుపు రంగులో మెరుస్తూ కనిపిస్తుంది. అయితే, తెల్ల బంగారం విషయానికొస్తే.. ఇది ప్లాటినం లేదా వెండితో సమానమైన వెండి-తెలుపు రంగును కలిగి ఉంటుంది. స్వచ్ఛమైన 24-క్యారెట్ బంగారం ఆభరణాలలో ఉపయోగించడానికి చాలా మృదువైనదిగా ఉంటుంది. తెల్ల బంగారాన్ని సృష్టించేందుకు, నికెల్, జింక్ వంటి లోహాలు స్వచ్ఛమైన బంగారంతో కలుపుతారు. ఈ ప్రక్రియ దాని రంగును మారుస్తుంది. మరింత మన్నికైనదిగా చేస్తుంది.
వైట్ గోల్డ్ లక్షణాలు
తెల్ల బంగారం ప్లాటినంకు ప్రత్యామ్నాయంగా పరిగణిస్తారు. ఇది సాధారణంగా 75 శాతం బంగారం, 25 శాతం నికెల్, జింక్ కలిగి ఉంటుంది. ఇది సాధారణంగా 14-క్యారెట్, 18-క్యారెట్ వేరియంట్‌లలో లభిస్తుంది. వీటిలో, 14-క్యారెట్ తెలుపు బంగారం బలమైనది, మన్నికైనది. ప్లాటినమ్‌తో పోలిస్తే వైట్ గోల్డ్ కూడా చాలా సరసమైనది, అదే రూపాన్ని కలిగి ఉంటుంది. వైట్ గోల్డ్.. ఎల్లో మెటల్ కంటే గట్టిగా ఉంటుంది. దీనికి తరచూ పాలిషింగ్ అవసరం. వైట్ గోల్డ్‌పై రోడియం కోటింగ్ 6-12 నెలల వరకు మాత్రమే ఉంటుంది. ఇది సిల్వరీ-వైట్ కలర్‌లో మెరిసిపోతూ ఉండాలంటే కాలక్రమేణా రోడియంతో కోట్ చేయాలి.
వైట్ గోల్డ్ ధర
సాధారణంగా లభించే బంగారం కంటే తెల్ల బంగారం చాలా ఖరీదైనది. ప్రధానంగా దాన్ని సృష్టించే ప్రక్రియ కారణంగా. తెల్ల బంగారాన్ని తయారు చేయడానికి రోడియం, అరుదైన, ఖరీదైన లోహంతో సహా అనేక దశలు అవసరం. రోడియం పూత తెల్ల బంగారం ప్రకాశాన్ని పెంచుతుంది. ఇది మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. ఇది అన్ని స్కిన్ టోన్‌లకు చక్కగా కనిపిస్తుంది. ఎలాంటి దుస్తులతోనైనా ధరించవచ్చు. డ్యూరబుల్, బ్యూటిఫుల్ జువెలరీ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
దాని మెరుపు, మన్నికను మెరుగుపరచడానికి ఇతర విలువైన లోహాలను జోడించడం వల్ల దాని ధర మరింత పెరుగుతుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ప్రస్తుత ధర రూ. 76,000 - రూ. 78,000 ఉంది. కానీ కొన్ని అదనపు కారకాల కారణంగా తెల్ల బంగారం ధర మరింత ఎక్కువగా ఉంటుంది. తెల్ల బంగారం ప్రత్యేక లక్షణాల విషయానికొస్తే.. మరింత ఆకర్షణీయంగా కనిపించే చేస్తుది. మోడ్రన్ జ్యువెల్లరీని మెచ్చే వారికి ఎల్లో మెటల్ కన్నా ప్రీమియం ప్రత్యామ్నాయంగా చేస్తుంది.