అన్వేషించండి

South Indian cuisine Sankranti 2025 Recipes : సంక్రాంతి స్పెషల్ బెల్లం అరిసెలు.. ఈ టిప్స్ ఫాలో అయితే అరిసెలు విరగకుండా టేస్టీగా వస్తాయి

Makar Sankranti 2025 Special Recipes : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటే అందులో అరిసెలు ఉండాల్సిందే. నోరూరించే టేస్టీ అరిసెలను సింపుల్​గా, టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం.

Sankranthi 2025 Specials Ariselu Recipe : పండుగ పిండివంటల్లో అరిసెలు కూడా క్రేజే వేరు. సంక్రాంతి అరిసెలు లేకుండా చేస్తే అది ఇన్​కంప్లీటే అవుతుంది. అలాంటి అరిసెలను పండగకు ముందే సిద్ధం చేసుకుని.. పండుగ సమయంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్​తో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. మరి ఈ టేస్టీ అరిసెలను బెల్లంతో ఎలా చేసుకోవాలో? కావాల్సిన పదార్థాలు ఏంటో? తయారు చేస్తున్నప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అయితే అరిసెలు విరగకుండా వస్తాయో ఇప్పుడు చూసేద్దాం. 

కావాల్సిన పదార్థాలు

బియ్యం - 1 కేజి

బెల్లం - ముప్పావు కేజి

తెల్ల నువ్వులు - అర కప్పు

యాలకుల పొడి - 2 స్పూన్లు

నెయ్యి - ఆరు స్పూన్లు 

తయారీ విధానం

బియ్యాన్ని రాత్రి కడిగి నానబెట్టుకోవాలి. రేషన్ బియ్యం తీసుకుంటే అరిసెలు చాలా బాగా వస్తాయి. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని ఉదయాన్నే కడిగి.. జల్లెడలో వేసుకోవాలి. నీరు అంతా పోయేవరకు అరగంట ఉంచి.. పిండిని ఆడించుకోవాలి. ఈ పిండిని ఆడించుకున్న వెంటనే అరిసెలు చేయడం మొదలు పెట్టేయాలి. ఎందుకంటే పిండి ఆరిపోతే అరిసెలు మంచిగా రావు. అరిసెలు విరిగిపోయే అవకాశాలు ఎక్కువ. కాబట్టి పిండి ఆరకముందే ప్రాసెస్​ను స్టార్ట్ చేయాలి. 

పిండిని ఆడించుకునేలోపు బెల్లాన్ని తురిమి పెట్టుకోవాలి. మంచి బెల్లాన్ని గడ్డలుగా లేకుండా.. తురుముకోవాలి. పిండి ఆడించి తెచ్చిన వెంటనే బెల్లాన్ని పాకం పట్టేయాలి. బెల్లం పాకం పట్టేందుకు స్టౌవ్ వెలిగించి.. దానిపై పెద్ద మందపాటి కడాయిని పెట్టాలి. దానిలో బెల్లం వేసి ఓ గ్లాస్​ నీళ్లు వేయాలి. సన్నన్ని మంటపై బెల్లాన్ని కరగనివ్వాలి. ఈ అరిసెలు చేయడానికి కచ్చితంగా ఇద్దరు వ్యక్తులు ఉండాలని గుర్తించుకోండి. 

Also Read : సంక్రాంతి 2025 స్పెషల్ బూందీ లడ్డూ రెసిపీ.. ఇలా చేస్తే రెండు వారాలైనా ఫ్రెష్​గా ఉంటాయి

బెల్లం కరిగి పాకం అయిన తర్వాత నీటిని తీసుకుని దానిలో సిరప్ వేయాలి. అది గడ్డకట్టే విధంగా మారితే పాకం సిద్ధమైనట్లే. ఇలా సిద్ధమైన పాకాన్ని ఒకరు గరిటతో తిప్పుతుంటే.. మరకొరు బియ్యం పిండిని దానిలో వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఎక్కడా ఆగకుండా పిండిని కలుపుతూ ఉండలు లేకుండా బెల్లంలో కలిసేలా కలుపుకోవాలి. ఈ క్రమంలో యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి. నెయ్యి కూడా రెండు స్పూన్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. పిండి బాగా కలిసేవరకు కలిపి.. గట్టిగా అయ్యేవరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ ఆపేసి.. దానిలో రెండు చెంచాల నెయ్యి వేసుకుని పిండిని ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.  

పిండి చల్లారిన తర్వాత ముద్దగా మారుతుంది. దానిని మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టుకుని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. వేగిన తర్వాత.. పిండిని కొద్దిగా తీసుకుని అరిసెలుగా ఒత్తుకోవాలి. వాటిని నూనెలో వేసి.. సన్నని మంటపై రెండువైపులా గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల అరిసెలు లోపల కూడా బాగా ఉడుకుతాయి ఎక్కువకాలం నిల్వ ఉంటాయి.

Also Read : సంక్రాంతి 2025కి ఈ ముగ్గులు ట్రై చేయండి.. పండక్కి ఈజీగా వేయగలిగే రంగోలి డిజైన్స్ ఇవే

Ingredients

  • 1 Kilogram బియ్యం
  • 750 Gram బెల్లం
  • 0.5 Cup తెల్ల నువ్వులు
  • 2 Teaspoon యాలకుల పొడి
  • 6 Teaspoon నెయ్యి

Cooking Instructions

Step 1

బియ్యాన్ని కడిగి రాత్రి నానబెట్టి.. ఉదయం నీరు లేకుండా వడకట్టి అరగంట పక్కన పెట్టి పిండిగా ఆడించుకోవాలి.

Recipe
Step 2

బెల్లం పాకాన్ని సిద్ధం చేసుకుని దానిలో బియ్యం పిండి వేస్తూ ఉండలు లేేకుండా కలుపుకోవాలి. దానిలో నెయ్యి, నువ్వులు, యాలకుల పొడి వేసి కలపాలి. పిండిని 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.

Recipe
Step 3

ఈ పిండిని అరిసెలుగా ఒత్తుకొని.. నూనెలో వేయాలి. రెండువైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. అంతే టేస్టీ అరిసెలు రెడీ.

Recipe

Summary

Sankranti 2025 Recipes : సంక్రాంతి స్పెషల్ బెల్లం అరిసెలు.. ఈ టిప్స్ ఫాలో అయితే అరిసెలు విరగకుండా టేస్టీగా వస్తాయి

Makar Sankranti 2025 Special Recipes : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటే అందులో అరిసెలు ఉండాల్సిందే. నోరూరించే టేస్టీ అరిసెలను సింపుల్​గా, టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం.

Makar Sankranti 2025 Special Recipe Ariselu  Tips for Better Taste Sankranti 2025 Recipes : సంక్రాంతి స్పెషల్ బెల్లం అరిసెలు.. ఈ టిప్స్ ఫాలో అయితే అరిసెలు విరగకుండా టేస్టీగా వస్తాయి
సంక్రాంతి స్పెషల్ బెల్లం అరిసెలు రెసిపీ(Image Source : Pinterest)
Source : Pinterest
810 Mins Total time
30 Mins Cook Time
30 Mins Prep Time
10 People Serves
Medium Difficulty
Veg Diet

Ingredients

  • 1 Kilogram బియ్యం
  • 750 Gram బెల్లం
  • 0.5 Cup తెల్ల నువ్వులు
  • 2 Teaspoon యాలకుల పొడి
  • 6 Teaspoon నెయ్యి

Main Procedure

Step 1

బియ్యాన్ని కడిగి రాత్రి నానబెట్టి.. ఉదయం నీరు లేకుండా వడకట్టి అరగంట పక్కన పెట్టి పిండిగా ఆడించుకోవాలి.

Step 2

బెల్లం పాకాన్ని సిద్ధం చేసుకుని దానిలో బియ్యం పిండి వేస్తూ ఉండలు లేేకుండా కలుపుకోవాలి. దానిలో నెయ్యి, నువ్వులు, యాలకుల పొడి వేసి కలపాలి. పిండిని 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.

Step 3

ఈ పిండిని అరిసెలుగా ఒత్తుకొని.. నూనెలో వేయాలి. రెండువైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. అంతే టేస్టీ అరిసెలు రెడీ.

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Modi congratulates Pawan Kalyan: కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
YSRCP Latest News:
"ఇరుసుమండ బ్లో అవుట్ వెనుక కుట్ర- కోట్లు చేతులు మారాయి" వైసీపీ సంచలన ఆరోపణలు 
Bhogi Mantalu 2026: ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!
ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!
Digital Arrest Scams: డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఉక్కుపాదానికి కేంద్రం ప్రయత్నాలు - మల్టీఏజెన్సీ ప్యానెల్‌ నియామకం
డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఉక్కుపాదానికి కేంద్రం ప్రయత్నాలు - మల్టీఏజెన్సీ ప్యానెల్‌ నియామకం

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్

Nara Vari Palle Sankranti: ముఖ్యమంత్రి కుటుంబం అంతా నారా వారి పల్లెలోనే - హుషారుగా సంక్రాంతి సంబరాలు !
ముఖ్యమంత్రి కుటుంబం అంతా నారా వారి పల్లెలోనే - హుషారుగా సంక్రాంతి సంబరాలు !
Adilabad Latest News: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 16న పర్యటించనున్న ముఖ్యమంత్రి! సదర్మాట్ బ్యారేజి, చనాక-కోరాట ప్రాజెక్టు  ప్రారంభోత్సవం!
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 16న పర్యటించనున్న ముఖ్యమంత్రి! సదర్మాట్ బ్యారేజి, చనాక-కోరాట ప్రాజెక్టు  ప్రారంభోత్సవం!
Jaggannathota Prabhala Teertham : సంక్రాంతి సంబరాలకు గోదావరి వెళ్తున్నారా? ఈ వేడుక చూడకుండా అసలు రావద్దు!
సంక్రాంతి సంబరాలకు గోదావరి వెళ్తున్నారా? ఈ వేడుక చూడకుండా అసలు రావద్దు!
PM Modi New Office: త్వరలోనే కొత్త ఆఫీస్‌లోకి ప్రధానమంత్రి మోదీ! ఇంటి చిరునామా కూడా మారుతుందా?
త్వరలోనే కొత్త ఆఫీస్‌లోకి ప్రధానమంత్రి మోదీ! ఇంటి చిరునామా కూడా మారుతుందా?
Embed widget