Sankranthi 2025 Muggulu : సంక్రాంతి 2025కి ఈ ముగ్గులు ట్రై చేయండి.. పండక్కి ఈజీగా వేయగలిగే రంగోలి డిజైన్స్ ఇవే
Sankranthi 2025 Muggulu Designs : సంక్రాంతి శోభను తెలిపే వాటిలో ముగ్గులు ప్రత్యేకం. భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో దాదాపు ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. ఈ సంక్రాంతికి ఈ ముగ్గులు ట్రై చేయండి.
Sankranthi 2025 Muggulu : సంక్రాంతికి వంటలే కాదు.. ముగ్గులు కూడా బాగా ఫేమస్. అందుకే ముగ్గుల పోటీలు కూడా ఈ సీజన్లో నిర్వహిస్తూ ఉంటారు. పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు కూడా ఇస్తూ ఉంటారు. ఈ కాంపిటేషన్‌లో చాలా మంది మహిళలు పాల్గొంటూ ఉంటారు. అయితే ఈ పోటీలే కాదు.. పండుగ సమయంలో ఇంటి ముందు వేసిన ముగ్గులకు కూడా కాంపిటేషన్ ఉంటుంది. పక్కన వారు ఎలాంటి ముగ్గు వేశారో చూడడం.. వాటికంటే మంచి ముగ్గు వేయాలనుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
సంక్రాంతి ముగ్గులు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. దానికంటే ముందు భోగి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే పండుగ రోజు ముగ్గులు వేసి.. వాటిపై గొబ్బెమ్మలు పెట్టడం సంప్రదాయంగా వస్తుంది. అందుకే ముగ్గులు వేసి.. వాటిని వివిధ రంగులతో రంగవళ్లులుగా తీర్చిదిద్ది.. వాటిపై గొబ్బెమ్మలు పేర్చి.. రేగుపండ్లు, పూలతో అలంకరిస్తూ ఉంటారు. మరి ఈ సంక్రాంతి 2025కి ఎలాంటి ముగ్గులను వేయొచ్చు. సింపుల్‌గా, త్వరగా వేయగలిగే అందమైన ముగ్గులను ఇప్పుడు చూసేద్దాం.
చుక్కల ముగ్గు
పండుగ సమయంలో కేవలం రంగోళిలే కాదు.. ఇలా చుక్కల ముగ్గులు కూడా ట్రై చేయవచ్చు. 17 చుక్కలు, మూడు వరసలు, మూడు వచ్చేవరకు చుక్కలు పెట్టి.. ఫోటోలో చూపించిన విధంగా సంక్రాంతి ముగ్గులు వేయొచ్చు. ఇలా వేసిన ముగ్గును మీకు నచ్చిన రంగులతో నింపితే సంక్రాంతి శోభ ఇట్టే వచ్చేస్తుంది.
చిలకల ముగ్గు
చిలక ఉండే ముగ్గులు ఏదైనా అవి మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయి. 11 చుక్కలు మధ్య 6 వచ్చేవరకు చుక్కలు పెట్టి మీరు ఈ చిలకల ముగ్గును సంక్రాంతి సమయంలో ట్రై చేయవచ్చు. చిలకలకు పచ్చరంగు వేసి.. మిగిలినవి మీకు నచ్చిన రంగులతో అలంకరిస్తే అదిరిపోతుందంతే.
సంక్రాంతి ముగ్గు
సంక్రాంతి శోభను తెలిపే ముగ్గు లేకుంటే అది సంక్రాంతి ముగ్గు ఎలా అవుతుంది. పాయసం, చెరకు గడలు, ధాన్యంతో నిండిన ఈ ముగ్గు పండుగ శోభను రెట్టింపు చేస్తుంది. పైగా ఇలాంటి ముగ్గును పూలతో కూడా కలర్ఫుల్గా మార్చుకోవచ్చు.
బసవన్న ముగ్గు
బసవన్న ముగ్గులు కూడా సంక్రాంతి శోభను పెంచుతాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సమయంలో డూ డూ బసవన్న బాగా ఫేమస్. దానికి గుర్తుగా ఈ తరహా రంగోలిని వేయొచ్చు.
నెమలి ముగ్గు
నెమలి లుక్‌ని ప్రతిబింబించే ముగ్గులు లేకుంటే ఆ ముగ్గులు అసంపూర్ణమే. చక్కగా నెమలి షేప్‌లో ముగ్గులు వేసి వాటిని కలర్ ఫుల్‌గా తీర్చిదిద్దితే పిల్లలు కూడా ఇష్టంగా చూస్తారు. సంక్రాంతి సమయంలో ఈ నెమలి ముగ్గులకు ఉండే క్రేజే వేరు.
ఇలా ఎన్నో రకాల ముగ్గులను మీరు సంక్రాంతి సమయంలో వేసుకోవచ్చు. మీరు వేసే ముగ్గులలో పిల్లలని కూడా పార్టిసిపేట్ చేసేలా చూడండి. వారికి రంగులు అద్దడం వంటివి నేర్పించండి. దీనివల్ల పిల్లలు కూడా సంప్రాదాయలకు దగ్గరగా ఉంటారు. అంతేకాకుండా ముగ్గులను కేవలం రంగులతోనే కాకుండా పూలతోనూ, దీపాలతోనూ అలంకరిస్తే అవి మరింత అందంగా కనిపిస్తాయి. ఇప్పుడు మీరు చూసిన ముగ్గులను అపార్ట్మెంట్లలో ఉండేవారు కూడా సింపుల్‌గా వేసుకోవచ్చు.
Also Read : సంక్రాంతి 2025 స్పెషల్ బూందీ లడ్డూ రెసిపీ.. ఇలా చేస్తే రెండు వారాలైనా ఫ్రెష్‌గా ఉంటాయి