సంక్రాంతికి ఆంధ్రాలో రకరకాల పిండి వంటలు చేస్తారు. అయితే వాటిలో టాప్ 5 ఏంటో ఇప్పుడు చూద్దాం.

సంక్రాంతి సమయంలో అరిసెలు లేని ఇల్లే ఉండదని చెప్పవచ్చు.

బియ్యం, బెల్లంతో చేసే నేతి అరిసెలు పండుగ వాతావరణాన్ని పెంచుతాయి.

కాస్త స్పైసీగా, క్రంచీగా తినాలనుకునేవారు జంతికలు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు.

శనగపిండి, బియ్యం పిండితో కలిపి జంతికలు చేసుకుంటారు.

సంక్రాంతికి సున్నుండలు చాలామంది చేసుకుంటారు.

మినుములు, బెల్లంతో చేసే ఈ వంటకానికి డిమాండ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది.

గోదారి జిల్లాలో కొబ్బరి కాయలు ఎంత ఫేమస్సో.. వాటితో చేసే కజ్జికాయలు కూడా అంతే ఫేమస్.

క్రంచీగా ఉండే చెక్కలను పిల్లల నుంచి పెద్దలవరకు ఇష్టంగా తింటారు. (All Images Source : Pinterest)