పొద్దున్నే నీళ్లు తాగడంతో రోజు ప్రారంభిస్తాం. అయితే కీరాదోస ముక్కలు కలిపిన నీళ్లు తాగితే మరింత ఆరోగ్యకరంగా ఉండవచ్చు.

ఒక గ్లాసు సాధారణ నీళ్లు తాగడం కంటే కీరా కలిపిన నీళ్లు తాగడం వల్ల శరీరం మరింత హైడ్రేటింగ్ గా ఉంటుంది.

కీరా తక్కువ క్యాలరీలు కలిగిన కాయగూర. కీరా కలిపిన నీళ్లు డీటాక్స్ గా కూడా పనిచేస్తుంది.

కీరాదోస నీటితో రోజును ప్రారంభించడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. కీరాలో పోటాషియం ఇతర పోషకాలు ఉంటాయి.

కీరా నీళ్లు తీసుకోవడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ నీటిలో ఆవశ్యక పోషకాలు ఉంటాయి.

కీరాలో విటమిన్ కె ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. కీరా నీళ్లతో ఎముకలు బలపడుతాయి.

కీరాలో ఉండే యాంటాఆక్సిడెంట్లు ఉంటాయి కనుక శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడుతాయి.

కీరాలో బీటా కెరోటిన్, కాల్షియం, పొటాషియం, ఫ్లెవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

కీరాలోని పోషకాలతో బూస్టప్ అయిన కీరా నీళ్లు తాగడం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels