బరువు ఎక్కువగా ఉండడం మాత్రమే కాదు, తక్కువగా ఉండడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.

పాలలో ప్రొటీన్, కాల్షియం, కార్బ్స్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. పాలు క్రమం తప్పకుండా తీసుకుంటే బరువు పెరగవచ్చు.

అన్నంతో తగినంత కార్బోహైడ్రేట్ లభిస్తుంది. బరువు పెరగడానికి చాలా మంచి సోర్స్.

డ్రైఫ్రూట్స్ ఎక్కువ తినడం వల్ల ఆరోగ్యకరంగా బరువు పెరగవచ్చు. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ప్రొటీన్లు వంటి పోషకాలు ఉంటాయి.

రెడ్ మీట్ లో ప్రొటీన్ ఎక్కువ. ఇది కండరనిర్మాణానికి తోడ్పడుతుంది. బరువు కూడా పెరగవచ్చు.



సాల్మన్ వంటి నూనె కలిగిన చేపల్లో ఫ్యాటీ ఆసిడ్లు, ప్రొటీన్లు ఉంటాయి. దీని వల్ల బరువు కూడా పెరగవచ్చు.

బంగళా దుంపలు ఎంతో రుచిగా ఉండడం మాత్రమే కాదు బరువు పెరిగేందుకూ దోహదం చేస్తాయి.

ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన అవకాడోలు క్రమం తప్పకుండా తీసుకుంటే త్వరగా బరువు పెరగవచ్చు.

యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఇతర పోషకాలతో గుడ్డు మంచి పోషకాహారం. బరువు పెరిగేందుకు ఇదొక మంచి ఆహారం.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels