కొంతమంది కొన్ని రకాల కూరగాయలు తిన్నపుడు అలర్జీకి గురవుతారు. అలాంటి వాటిలో టమాటాలు, క్యాప్సికం, పచ్చిమిరప, వంకాయ, బంగాళదుంపల వంటివి కొన్ని. పిండి పదార్థాలు కలిగిన బంగాళదుంప, చిలగడదుంప ఎక్కువ తీసుకుంటే ఆహారంలో సమతుల్యత లోపించవచ్చు. కిడ్నీ స్టోన్స్ వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఆక్సలేట్స్ ఎక్కువగా ఉండే పాలకూర, లెట్యూస్ వంటివి తీసుకోవద్దు. కొన్ని కూరగాయల్లో ఆలిగోసాకరైడ్లు, డిస్ సాకరైడ్లు, మోనోసాకరైడ్లు, పాలీయోసిస్ ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థలో అసౌకర్యానికి కారణం అవుతాయి. సంప్రదాయపద్ధతుల్లో పండించిన కాయగూరల్లో అధిక మొత్తంలో క్రిమిసంహారక అవశేషాలు ఉండే ప్రమాదం ఉంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే! Images courtesy : Pexels