అరటిపండు తింటే బీపీ తగ్గుతుందా? హైబీపీ అనేది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. హైబీపీ గుండెపోటుతో పాటు చాలా సమస్యలకు కారణం అవుతుంది. బీపీని కంట్రోల్ లో ఉంచుకోవాలంటే అరటి పండు తినాలంటున్నారు నిపుణులు. అరటి పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. పొటాషియం రక్తనాళాల్లోని ఒత్తిడిని తగ్గించి బీపీ కంట్రోల్ చేస్తుంది. రక్తనాళాల్లోని కొవ్వును కరిగించి రక్త ప్రసరణ సజావుగా జరిగేలా చూస్తుంది. రోజూ అరటిపండు తింటే గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్న నిపుణులు. All Photos Credit: Pixabay.com