ఆధునిక అమ్మాయిలు సౌందర్య సంరక్షణకు వీలైనంత వరకు రసాయనాలు లేని పదార్థాలే వాడాలని అనుకుంటున్నారు.

ఈ రోజుల్లో రైస్ వాటర్ చాలా ప్రాచూర్యంలో ఉంది. మరి ఇదెంత వరకు పనిచేస్తుందో చూద్దాం.



బియ్యం నానబెట్టి పులియబెట్టి ఉపయోగించే పద్ధతి చాలా పురాతనమైంది. ఈ నీటిని సౌందర్య పోషణకు వాడుతారు.

బియ్యం నానబెట్టగా వచ్చిన నీళ్లలో విటమిన్లు, అమైనో ఆమ్లాలు. ఖనిజలవణాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

ఈ నీటిని తాజాగా వాడుకోవచ్చు లేదా పులియబెట్టి కూడా వాడొచ్చు. పులియబెట్టినపుడు వీటిలో పోషకాలు పెరుగుతాయి.



అందువల్ల చర్మానికి, జుట్టుకు మరింత మేలు జరుగుతుంది.

రైస్ వాటర్ చర్మ ఛాయను పెంపొందిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆక్సిడేషన్ నుంచి కాపాడతాయి.

ఫలితంగా వయసు పెరగడం వల్ల చర్మంలో కలిగే మార్పులు తగ్గుముఖం పడతాయి.

సన్నటి గీతలు, ముడుతలు తగ్గుతాయి. తామర, వడదెబ్బ వల్ల చర్మానికి జరిగిన నష్టం నుంచి కూడా ఉపశమనం దొరుకుతుంది.

రైస్ వాటర్ తో జుట్టు శుభ్రం చేసుకోవడం లేదా హెయిర్ మాస్క్ లో వినియోగించడం వల్ల జుట్టు మెరుపు సంతరించుకుంటుంది.



దీనిలోని అమైనో ఆమ్లాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. జుట్టు చివర్లు చిట్లకుండా ఆరోగ్యంగా పెరుగుతాయి.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels