రోజూ ఒక ఆపిల్ తింటే డాక్టర్‌తో పని ఉండదని అంటారు. అందులో నిజమెంత?

ఆపిల్ లో పుష్కలమైన ఫైబర్ ఉంటుంది. ఆపిల్ తినగానే కడుపునిండుతుంది. కాలరీ ఇన్ టేక్ తగ్గి బరువు అదుపులో ఉంటుంది.

ఆపిల్స్ లో ఉండే పెక్టిన్ ప్రిబయోటిక్ గా పనిచేస్తుంది. అందువల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఒక మోతాదు సైజులో ఉన్న ఆపిల్ రోజూ తీసుకుంటే బీపీ, కొలెస్ట్రాల్, ఇన్ఫ్లమేషన్ వంటి వాటన్నింటిని అదుపు చెయ్యవచ్చు.

ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఆపిల్ తినేవారిలో ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది.

ఆపిల్‌లో ఉండే ఫిసెటిన్ అనే సమ్మేళనం మెదడును చురుకుగా ఉంచి అల్జీమర్స్ ను నివారిస్తుంది.

ఆపిల్ తొక్కలో క్వెర్సెటిన్ అనే ఫ్లవనాయిడ్ ఉంటుంది. ఇది ఇమ్యూనిటిని పెంచుతుంది.

ఆపిల్ తో ఇన్సులిన్ పనితీరు కూడా మెరుగవుతుంది. ఫలితంగా షుగర్ కూడా అదుపులో ఉంటుంది.

ఫ్లోరిడ్జిన్ అనే ఫైటో న్యూట్రియెంట్ వల్ల ఆపిల్ ఎముకలను బలోపేతం చేస్తుంది. ఎముక సాంద్రత పెరుగుతుంది.

ఆపిల్ లో ఉండే ఫైటో కెమికల్స్ శ్వాసవ్యవస్థ పనితీరును మెరుగు పరిచి ఆస్తమా వంటి అలర్జీలు ఉన్న వారిలో లక్షణాలు తగ్గిస్తుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels